Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదే భవిష్యత్ అని మా అమ్మ చెప్పేవారు : మాయాబజార్ ఫర్ సేల్’ప్రీ రిలీజ్ లో వీకే నరేష్

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (11:07 IST)
VK Naresh, Gauthami, Tarun Bhaskar, Navadeep
డిజిటల్ మాధ్యమం జీ 5 త్వరలోనే ‘మాయాబజార్ ఫర్ సేల్’  అనే స‌రికొత్త మ‌ల్టీస్టార‌ర్ తెలుగు వెబ్ ఒరిజిన‌ల్‌ను అందించనుంది. వివిధ కథ, కథనాల ద్వారా సెటైరికల్ డ్రామాగా రూపొందుతోన్న ‘మాయాబజార్ ఫర్ సేల్’ వెబ్ సిరీస్ గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌తో రూపొందుతోంది. జీ 5తో పాటు రానా ద‌గ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా బ్యాన‌ర్ క‌లిసి సునిశిత‌మైన‌, హృద్య‌మైన డ్రామాగా మాయాబ‌జార్ ఫ‌ర్ సేల్‌ను రూపొందిస్తున్నారు. ఇదొక గేటెడ్ క‌మ్యూనిటీలోని కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. గౌత‌మి చిల్ల‌గుల్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సిరీస్ జూలై 14 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది.  
 
ఈ సంద‌ర్భంగా నవదీప్ మాట్లాడుతూ.. "గతంలో పల్లెటూర్లలోని ప్రజలు అందరూ ఒక కుటుంబంలాగా ఉండేవాళ్లు. సాయంత్రమైతే ఓ ఇంటి వద్ద అందరూ కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్లు. అలాంటి ఎమోషన్స్‌ను డైరెక్టర్ చక్కగా చూపించారు. రకరకాల మనుషులు ఉన్నారు. ఒకరికి పిల్లి నచ్చదు. ఒకరికి కుక్క నచ్చదు. అన్ని పాత్రలను డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎప్పుడో రామానాయుడు గారు మొదలు పెట్టిన ఒక అఖండ దీపాన్ని ముందుకు తీసుకువెళుతూ.. యంగ్ టీమ్‌ను, కొత్త ప్రొడక్ట్స్‌ను స్క్రీన్‌పై తీసుకువస్తున్న మా రానాకు ఆల్‌ ద బెస్ట్. మాయాబజార్‌లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు.
 
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. "మాయబజార్ మూడో ఎపిసోడ్ కొంచెం చూశాం. నాకు అద్భుతంగా నచ్చింది. ఇంతమంది నటీనటులను కలిపి ఒక చోట చేర్చడం చాలా కష్టమైన పని. నేను మారేడ్‌పల్లి జాగృతి రెసిడెన్సీలో ఉండే వాడిని. ఆ టైమ్‌లో బాల్కనీలో కాఫీ తాగుతుంటే.. నా ఎదురుగా ఒక అమ్మాయి పుస్తకాలు చదువుతున్నట్లు తిరిగేది. అదే టైమ్‌కు మా మమ్మీ చెడ్డీని ఆరేస్తూ కట్టేతో ఇలా అంటే.. అది ఆమె బాల్కనీలో పడ్డది. దెబ్బకు నా లవ్ లైన్ బ్రేక్ అయింది. ఇలాంటి ఎన్నో కథలు కమ్యూనిటీలో జరుగుతాయి. అన్ని విషయాలు గౌతమి మీ ముందుకు తీసుకువస్తోంది. ఫ్యామిలీ మొత్తం కాఫీ, బిస్కెట్లు పెట్టుకుని హ్యాపీగా చూడండి. తప్పకుండా జీ5లో చూడండి. ఇది సరికొత్త అమృతంలా మారుతుంది" అని అన్నారు.
 
సీనియర్ నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడే మూడు ఎపిసోడ్స్ చూశా. కాన్సెప్ట్, వర్క్‌షాప్‌, షూట్ దగ్గర నుంచి ఇవాళ ఫస్ట్ కాపీ చూస్తున్నా. మాయాబజార్ గురించి చెప్పాలంటే.. టీవీ, ఓటీటీలో ఇది ఒలింపిక్ గేమ్‌ఛేంజర్. మూడు ఎపిసోడ్స్ చూశా. ఫస్ట్ ఫ్రేమ్‌ నుంచి చివరి ఫ్రేమ్‌ వరకు అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇంత మంది నటులను చూస్తుంటే బాహుబలి ప్రీమియర్ కనిపిస్తోంది. డైరెక్టర్‌ గౌతమికి వచ్చిన పూనకమే ఇవాళ ఫైనల్ రిజల్ట్. సాధారణంగా మహిళలు పిల్లలకు బట్టలు వేసి.. స్కూల్‌కు పంపించి డైరెక్షన్ చేస్తున్నారని అంటున్నాం. మా అమ్మ మొదలు పెట్టారు ఇది. మరో ఐదేళ్ల తరువాత నేను ఇదే స్టేజ్‌పై నుంచి చెబుతా. మగ దర్శకులందరూ కూడా ఇంట్లో పిల్లలకు బట్టలు వేసి.. వంటలు చేసుకోంటారేమో అనిపిస్తుంది. ప్రస్తుతం అందరూ మహిళలే ఉన్నారు. ఇదే భవిష్యత్ అని మా అమ్మ చెప్పేవారు. డైరెక్టర్ గౌతమి చాలా అద్భుతంగా పని చేసింది. ప్రతి తెలుగు ఆడియన్ చూడాల్సిన సినిమా ఇది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఉన్న ప్రేక్షకులు కూడా తప్పకండా చూడండి. అందరూ చాలా బాగా నటించారు. ఇరుగు పొరుగు అనేది చాలా ముఖ్యం. అపార్ట్‌మెంట్స్ వచ్చిన తరువాత కాస్త తగ్గింది. విల్లాస్ అనేది బ్యూటీఫుల్ కాన్సెప్ట్. చిన్న గ్రామంలా బ్యూటీఫుల్‌గా చూపించారు. నా కెరీర్‌లో బెస్ట్ సినిమాల్లో ఇది ఒకటి. జీ5లో ఒలింపిక్ గేమ్ ఛేంజర్ రాబోతుంది. పార్ట్-2 వచ్చినా మీరు ఆశ్చర్యపోకండి" అని అన్నారు.
 
దర్శకురాలు గౌతమి మాట్లాడుతూ, శ్వేతా టీసీఎస్‌లో పనిచేసేది. నేను సీఎస్‌సీలో వర్క్ చేసేదాన్ని. ఇద్దరం సాయంత్రం బండిపై వెళుతూ.. కేపీహెచ్‌బీలో కూరగాయలు కొనుక్కొని బెండకాయలు కట్ చేసుకుంటూ భవిష్యత్‌లో ఫిల్మ్ మేకర్స్ అవ్వాలని అనుకునే వాళ్లం. కలిసి రాయాలి. కలిసి పనిచేయాలని అనుకునే వాళ్లం. నేను ఇంత పెద్ద సిరీస్ చేస్తానని అనుకోలేదు. నాకు కష్టమైన పరీక్ష రాస్తున్న పరిస్థితి. నటీనటులందరికీ థ్యాంక్స్. ఝాన్సీ గారి రోల్ మా అమ్మలానే ఉంటుంది. చాలా మదర్స్‌కు ఎవరు ఎలా పోయినా సరే.. వాళ్ల పిల్లలు ఒక ముద్ద తింటే చాలు. స్క్రీన్‌పై ఇలాంటి పాత్రలు చాలా బాగా వచ్చాయి. అమృతంలాగా మనలో ఒక స్టోరీ అవ్వాలని మేము రాశాం. అందరూ తప్పకుండా చూడండి" అని కోరారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments