Webdunia - Bharat's app for daily news and videos

Install App

మై డియర్ భూతం ఫస్ట్ సాంగ్ ఆద‌ర‌ణ‌

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (18:51 IST)
Prabhu Deva
డాన్స్ మాస్టర్‌గా స్టార్ హీరోలకు ఎన్నో సూపర్ డూపర్ సాంగ్స్ కంపోజ్ చేసి ప్రశంసలందు కున్నారు ప్రభుదేవా. మరోవైపు దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలు సినిమాలకు పనిచేసి తనలో దాగి ఉన్న టాలెంట్ బయటపెట్టారు. ఇక నటుడిగా ఎన్నో సినిమాల్లో వెండితెరపై ప్రభు దేవా మార్క్ కనిపించింది. ఈ క్రమంలోనే ప్రభు దేవా ప్రధానపాత్రలో రాబోతున్న కొత్త సినిమా 'మై డియర్ భూతం'. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 
 
తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, అంతకుమించిన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు.
 
ఇందులో భాగంగా తాజాగా ఈ మై డియర్ భూతం మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మాస్టర్ ఓ మై మాస్టర్ అంటూ ఫాస్ట్ బీట్‌‌తో సాగిపోతున్న ఈ పాటలో ప్రభుదేవా డాన్స్ హైలైట్ అయింది. ఎప్పటిలాగే స్టైలిష్ స్టెప్స్‌తో ఆకట్టుకున్నారు ప్రభుదేవా. నీ మనసు కన్న కళలు అన్నీ చూసేయ్.. చూసేయ్.. నిన్ను మించినోడు లేనేలేడు ఆడేయ్ పాడేయ్ అంటూ రాసిన లిరిక్స్ ప్రేరణాత్మకంగా ఉన్నాయి. అరవింద్ అన్నెస్ట్ పాడిన ఈ పాటకు డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి అందించిన లిరిక్స్ ప్రాణం పోశాయి. రాజేష్, డి. ఇమ్మాన్ కట్టిన బాణీలు ఈ సాంగ్ లెవెల్ మార్చేశాయి. పాటకు తగ్గట్టుగా డిఫరెంట్‌గా చూపించిన విజువల్స్ ఆకట్టుకున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ సాంగ్ మై డియర్ భూతం సినిమాకు మేజర్ అట్రాక్షన్ అవుతుందని స్పష్టమవుతోంది. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది. 
  
ఇకపోతే ఈ ఫాంటసీ మూవీలో జీనీగా ప్రభుదేవా నటిస్తున్నారు. ఓ మంచి మెసేజ్ ఇస్తూ జీనీకి కిడ్స్‌కి మధ్య జరిగే సన్నివేశాలతో ఈ మూవీ అలరించనుందట. జీనీ పాత్రలో ప్రభుదేవా ఒదిగిపోయారని, ఆయన లుక్ ఎంతో పర్ఫెక్ట్‌గా సెట్ అయిందని, ఈ మేకోవర్ నాచురల్‌గా ఉండాలని ఎంత కష్టపడ్డారో రీసెంట్‌గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కన్ఫర్మ్ చేసింది. ఈ లుక్ కోసం ఎలాంటి విగ్ వాడకపోవడం విశేషం. ప్రభు దేవా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతి కలిగించేలా ఈ మూవీ రూపొందిస్తున్నామని దర్శకనిర్మాతలు అన్నారు.
 
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రమ్య నంబీసన్ కీలక పాత్ర పోషించగా.. బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డి. ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. యూకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో హైలైట్ కానుందట. వీఎఫ్ఎక్స్ వర్క్ అబ్బురపరచనుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అతి త్వరలో ప్రకటించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరూర్ తొక్కిసలాట ఘటన.. బాధ్యులపై కఠిన చర్యలు ... సీఎం స్టాలిన్ హెచ్చరిక

TVK Vijay: కరూర్ తొక్కిసలాట దురదృష్టకరమన్న పవన్ కల్యాణ్- భరించలేకపోతున్నాన్న విజయ్

TVK Vijay: పుష్ప-2 తొక్కిసలాట.. అల్లు అర్జున్ తరహాలో టీవీకే అధినేత విజయ్ అరెస్ట్ అవుతారా?

TN stampede: TVK Vijay సభలో తొక్కిసలాట- 31కి చేరిన మృతుల సంఖ్య- విద్యుత్ అంతరాయం వల్లే? (Video)

TVK Vijay: విజయ్ ర్యాలీలో పెను విషాదం, తొక్కిసలాటలో 20 మంది మృతి, ఇంకా పెరిగే అవకాశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments