Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సంపూ.. నువ్వు నా దృష్టిలో ఒక సూపర్ స్టార్' : ముమైత్ ఖాన్

టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుపై తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ బ్యూటీ‌గా పేరుగాంచిన ముమైత్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించింది. గురువారం జెమినీ టీవీ అవార్డుల కార్యక్రమానికి సంపూతో పాటు ముమైత్ ఖాన్

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (17:16 IST)
టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుపై తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ బ్యూటీ‌గా పేరుగాంచిన ముమైత్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించింది. గురువారం జెమినీ టీవీ అవార్డుల కార్యక్రమానికి సంపూతో పాటు ముమైత్ ఖాన్ హాజరైంది. ఆ తర్వాత సంపూ గురించి కొన్ని ట్విట్టర్‌లోని కొన్ని ఆశ్చర్యకరమైనో పోస్టులు చేశారు. "సంపూ.. నువ్వు నా దృష్టిలో ఒక సూపర్ స్టార్.. నాడు యూ ట్యూబ్‌లో నీ వీడియోలు చూశాను.. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ వ్యూయర్స్ నీ గురించి నీ కామెడీ సీన్ల గురించి చెపుతూ ఉంటారు. అనారోగ్యంతో ఉన్నపుడు ఆ నీరసం నుంచి కోలుకోవడానికి నీ కామెడీతో నవ్విస్తూ నాకెంతో సాయం చేశావు.. నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది" అంటూ ముమైత్ ఖాన్ ట్వీట్ చేసింది. 
 
సంపూతో సినిమాలు తీసే వారికి సంపూ పక్కన హీరోయిన్‌గా నటించే అమ్మాయి దొరకడం సమస్య అవుతున్న నేపథ్యంలో ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్‌కు మహరాణిలా ఒక వెలుగు వెలిగిన బాలీవుడ్ బ్యూటీ ముమైత్ ఖాన్ సంపూపై ప్రశంసలు కురిపించడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. 
 
దీంతో ముమైత్ చూపించిన అభిమానానికి పొంగిపోయిన సంపూ ముమైత్ వంటి అందాల నటి తనను అభిమానించడంతో తనకు మాటలు రావడం లేదని స్పందించాడు. అయితే ఈ విషయాలు అన్నీ చూస్తున్న వారికి మాత్రం బాలీవుడ్ హాట్ బ్యూటీ ముమైత్ దృష్టి సంపూపై ఎందుకు పడిందో తెలియక చాలామంది తికమక పడుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments