Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖేష్ అంబానీ కామెంట్... ఐష్ సినిమాకు షాక్... బాబ్బాబు ప్లీజ్.. ఈ ఒక్క సినిమా...

ఐశ్వర్యా రాయ్ తాజాగా నటించిన చిత్రం యే దిల్ హై ముష్కిల్ చిత్రంలో పాకిస్తాన్ నటులు ఉండటంతో ఇప్పుడా చిత్రం విడుదలపై కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఈ చిత్రాన్ని విడుదల చేసేది లేదని ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, గోవాకు చెందిన సింగిల్ స్క్రీన్ థియేటర

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (15:12 IST)
ఐశ్వర్యా రాయ్ తాజాగా నటించిన చిత్రం యే దిల్ హై ముష్కిల్ చిత్రంలో పాకిస్తాన్ నటులు ఉండటంతో ఇప్పుడా చిత్రం విడుదలపై కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఈ చిత్రాన్ని విడుదల చేసేది లేదని ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, గోవాకు చెందిన సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు ప్రకటించారు. ఇదిలావుండగా తాజాగా ముఖేష్ అంబానీ చేసిన వ్యాఖ్యలు దీనికి తోడయ్యాయంటున్నారు. వాస్తవానికి ఆయన ఈ చిత్రం గురించి నేరుగా మాట్లాడలేదు. 
 
ప్రముఖ పాత్రికేయులు శేఖర్ గుప్తా, బర్ఖాదత్ ఆధ్వర్యంలో ది ప్రింట్ నిర్వహించిన ఆఫ్ ది కప్ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ మాట్లాడారు. తనకు కళలు, సంస్కృతి వీటన్నిటికన్నా భారతదేశమే ముఖ్యమైందని స్పష్టం చేశారు. తానేమీ మేధావిని కాదనీ, అందుకే ఇలాంటివి తనకు అర్థం కాదని చెప్పిన ముఖేష్, తను అందరిలా భారతీయుడినే కాబట్టి దేశభక్తికే ఓటు వేస్తానని చెప్పారు. దీనితో కరణ్ జోహార్ దిగివచ్చి... బాబ్బాబు ఈ ఒక్క సినిమాను వదిలేయండి. ఇకపై పాకిస్తాన్ దేశానికి చెందిన నటీనటులతో సినిమాలు చేయనని బ్రతిమాలుకుంటున్నారు. మరి దీపావళి నాటికి ఐశ్వర్యారాయ్ నటించిన చిత్రం దేశంలో ఎన్ని సినిమా హాళ్లలో విడుదలవుతుందో చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments