Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశేషాధారణ దక్కించుకుంటున్న ముగ్గురు మొనగాళ్ళు

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (16:24 IST)
Mugguru monagaallu
శ్రీ‌నివాస్‌రెడ్డి, దీక్షిత్‌ శెట్టి (కన్నడ హిట్‌ మూవీ ‘దియా’ ఫేమ్‌), వెన్నెల రామారావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. ఫస్ట్ లుక్, ట్రైల‌ర్‌ లతోనే మంచి బజ్ ను క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో  విడుద‌ల‌ అయ్యి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది.అంగవైకల్యం కలిగిన ముగ్గురు యువకులు  ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు.. ఆ కేసు నుండీ ఎలా బయటపడ్డారు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీనివాసరెడ్డికి విన‌ప‌డ‌దు, దీక్షిత్‌ శెట్టి మాట్లాడలేడు, వెన్నెల రామారావుకు కనపడదు. ఈ ముగ్గురు నటులు కూడా తమ తమ పాత్రలకు జీవం పోశారనే చెప్పాలి. వీరి నటనతో ఆధ్యంతం ప్రేక్షకులను క‌డుపు చ‌క్క‌లయ్యేలా న‌వ్వించారు. 
 
ఈ చిత్రంలో ఎన్నో థ్రిల్లింగ్‌ అంశాలు కూడా ఉన్నాయి. 'గ‌రుడ‌ వేగ' ఫేమ్ అంజి అందించిన  విజువ‌ల్స్‌, సురేష్  బొబ్బిలి సంగీతం, చిన్న  నేపేథ్య సంగీతం వంటివి ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలుగా నిలిచాయని చెప్పొచ్చు. ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్లో మంచి ఆదరణ దక్కుతుంది.అలాగే మంచి వ్యూయర్ షిప్ కూడా నమోదవుతుండడం హర్షించదగ్గ విషయం. ఆల్రెడీ 'ముగ్గురు మొనగాళ్ళు' అమెజాన్ ప్రైమ్లో నెంబర్ 2 ప్లేస్ లో ట్రెండ్ అవుతుండడం విశేషం. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'చిత్రమందిర్‌ స్టూడియోస్‌' బ్యానర్ పై  అచ్యుత్‌ రామారావు నిర్మించారు. 
 
నటీనటులు : శ్రీనివాసరెడ్డి, దీక్షిత్‌ శెట్టి (‘దియా’ మూవీ హీరో), వెన్నెల రామారావు, రిత్విష్‌శర్మ, శ్వేతా వర్మ, నిజర్, రాజా రవీంద్ర, జెమిని సురేష్, జోష్‌ రవి, భ‌ద్రం, సూర్య, జబర్తస్త్‌ సన్నీ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. లేకుంటే ఆ పని చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments