Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదో వేశ్యావాటిక... 2 వేల మంది అమ్మాయిలు... 6 రౌండ్లు...

అమ్మాయిల అక్రమ రవాణా, అభంశుభం తెలియని ఆడపిల్లలను సంపన్నుల సుఖాలు తీర్చే బానిసలుగా మారుస్తున్న వైనంపై, మహిళల అక్రమ క్రయవిక్రయాలపై రూపొందుతోన్న సినిమా 'లవ్‌ సోనియా'. అక్రమ రవాణాలో రాష్ట్రాల సరిహద్దులు ద

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (15:14 IST)
అమ్మాయిల అక్రమ రవాణా, అభంశుభం తెలియని ఆడపిల్లలను సంపన్నుల సుఖాలు తీర్చే బానిసలుగా మారుస్తున్న వైనంపై, మహిళల అక్రమ క్రయవిక్రయాలపై రూపొందుతోన్న సినిమా 'లవ్‌ సోనియా'. అక్రమ రవాణాలో రాష్ట్రాల సరిహద్దులు దాటిపోయి వేశ్యావాటికల్లో దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్న మహిళల రక్షణకు తబ్రేజ్‌ నూరానీ పదేళ్లుగా కృషి చేస్తున్నారు.
 
ఈ క్రమంలో కొందరి జీవితాలను చూసి చలించిన ఆయన ఈ మహిళా సమస్యను లోకం దృష్టికి తీసుకురావాలని సమస్య మూలాల నుంచి అధ్యయనం చేసి కథ రాశారు. సినిమాగా తీయాలని సంకల్పించారు. అక్కాచెల్లెళ్ల నేపథ్యంలో కథ సాగుతుంది. అందులో వ్యభిచార గృహానికి చేరుకున్న యువతిగా మృణాల్‌ ఠాకూర్‌ నటించారు. ఫ్రిదా పింటో, డెమీ మూర్‌ వంటి హాలీవుడ్‌ కథానాయికలు నటించిన ఈ సినిమాలో మృణాల్‌ది ముఖ్య పాత్ర. 
 
ఈ చిత్రంలో నటించే ఛాన్స్ ఎలా దక్కిందన్న అంశంపై మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ, ఈ చిత్రంలో నటించే ఛాన్స్ తనకు అంత సులభంగా రాలేదన్నారు. తనకంటే ముందు ఆ పాత్ర కోసం సుమారు 2000 మంది అమ్మాయిలను ఆరు రౌండ్ల చొప్పున ఆడిషన్‌ చేశారని తెలిపింది. అలాగే తనకు కూడా అడిషన్ చేసినట్టు చెప్పారు. 
 
అయితే, నేను మాత్రం 10-15 మంది అమ్మాయిలతో కలిసి ఆడిషన్‌ ఇచ్చా. అప్పుడు నాకు తెలిసిందల్లా... 'సెక్స్‌ ట్రాఫికింగ్‌కి సంబంధించిన చిత్రమిది. అందులో నా పాత్రకు ఒక సిస్టర్‌ ఉంటుంది. తనని ప్రాణంగా ప్రేమిస్తుంది. సిస్టర్‌ కోసం ఎవర్ని చంపడానికైనా సరే వెనుకాడదు' అని వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం