Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క లిప్ కిస్ కూడా లేకుండా "మిస్టర్ అండ్ మిస్" ట్ర‌ైల‌ర్‌

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (17:28 IST)
Mr & Miss
రీడింగ్ ల్యాంప్స్ క్రియేషన్స్ పతాకంపై శైలేష్ సన్ని, జ్ఞానేశ్వరి కండ్రేగుల జంటగా అశోకరెడ్డి దర్శకత్వంలో వస్తున్న క్రౌడ్ ఫండెడ్ చిత్రం "మిస్టర్ & మిస్‌`. ఈ నెల 29న విడుదలవుతుంది. దర్శకుడు అశోక్ చిత్రం గురించి..." మిస్టర్ అండ్ మిస్" బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.ఒక జంట సెల్ఫీ రొమాంటిక్ వీడియోను ఇష్టపడి తీసుకుంటే ఆ వీడియో వారి చేతులు దాటి మూడవ వ్యక్తికి చేరితే ఎలా ఉంటుంది. 
 
వాళ్లు హైలో ఉన్నప్పుడు తీసుకున్న ఈ వీడియో  సొసైటీ కి చేరినపుడు వారి పేరెంట్స్ ఎలా స్త్రగుల్ అవుతారు, వాళ్ల రిలేటివ్స్ ఎలా ఫీలవుతారు, వీళ్లు ఎలా ఫేస్ చేశారు అనేది ఈ కథ. దీనికి ఒక మంచి లవ్ స్టోరీ జతచేసి తీయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ ను ఫస్ట్ రిలీజ్ చేశాము. దానికి అనుకున్న వ్యూస్ రాలేదు. ఇప్పుడొస్తున్న సినిమాలు అన్నీ బోల్డ్ కంటెంట్ తో వస్తున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా ఆ కోవలోకే చెందిందని చాలామంది అన్నారు. 
 
అందువల్ల రెండవట్రైలర్ లో  ఒక్క లిప్ కిస్ కూడా లేకుండా ఈ ట్రైలర్ ను విడుదల చేశాము.ఈ సినిమాకు దాదాపుగా 50 నుంచి 100  మంది వరకు ఇన్వెస్ట్ చేసి తీసిన క్రవుడ్ ఫండెడ్ మూవీ. నా మీద, నా స్టోరీ మీద ఇంత నమ్మకం పెట్టి ఇన్వెస్ట్ చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు.ఇది ఓన్లీ యూత్ తో పాటు పేరెంట్స్ కూడా చూడదగ్గ సినిమా.మీరందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.ఈ నెల 29న  విడుదల అవుతున్నా మా సినిమాను మీరందరూ  తప్పక చూడాలని కోరుకుంటున్నానని అన్నారు.
 
హీరోయిన్ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ ..అందరూ అందరూ ఫస్ట్ డే నుంచి ఈరోజు వరకు చాలా కష్టపడి పనిచేశాం. మేము చేసిన డెమో షార్ట్ ఫిలిం కి సైమా అవార్డు లో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. మాపై నమ్మకంతో ఎంతోమంది ఇన్వెస్ట్ చేసిన వారి మనీ ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకూడదని  ఈ మూవీ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రతి రూపాయి మేము జస్టిఫై చేశామని అను కుంటున్నాము. 
 
రొమాన్స్ కోసం తీసిన సినిమా కాదిది కథ డిమాండ్ చేస్తే చేసిన సినిమా. మేము విడుదల చేసిన ఫస్ట్ ట్రైలర్ కు, సెకండ్ ట్రైలర్ కు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సీన్సే కాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా  చాలా ఉన్నాయి. చాలా రోజుల నుండి మేము ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం.ఈ నెల 29 న విడుదల అవుతున్న మా సినిమాను మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు.
 
 హీరో సన్నీ మాట్లాడుతూ ...ఒక చిన్న సినిమా వస్తుందంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో మధుర శ్రీధర్ గారు ఒకరు.నేను చేస్తున్న మొదటి సినిమాకు మధుర శ్రీధర్ గారు వచ్చి సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది..
 
 ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ..అశోక్ కష్టాన్ని  దగ్గరగా చూసిన వ్యక్తిని నేను, సినిమా కోసం ఇంత కష్ట పడతారా అనుకున్నా.. అతని బ్లడ్ లో కూడా సినిమా కనబడేలా కష్టపడతాడు అశోక్ కు చిత్ర యూనిట్ అందరికీ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments