Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ బచ్చన్ లో పోటాపోటీగా రవితేజ, జగపతిబాబు పాత్రలు

డీవీ
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (10:14 IST)
Jagapathi Babu
హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ క్రేజీ ప్రాజెక్ట్ 'మిస్టర్ బచ్చన్‌'లో బిజిఎస్ట్ యాక్టర్స్ లో ఒకరైన జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
 
అనౌన్స్ మెంట్ పోస్టర్ లో జగపతి బాబు ఇంటెన్స్, ఫెరోషియస్ లుక్ లో కనిపించారు. చెస్ మూవ్ ని చేతిలో పట్టుకొని సీరియస్ గా చూస్తున్న లుక్ అదిరిపోయింది. 'మిస్టర్ బచ్చన్‌' లో జగపతి బాబు పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని ఈ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్, జగపతి బాబు పాత్రని పవర్ ప్యాక్డ్ గా ప్రజెంట్ చేస్తున్నారు.    
 
రవితేజ, జగపతిబాబులను తెరపై చూడటం కనుల పండువగా ఉంటుంది. ఇద్దరికీ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ రాసుకున్నారు హరీష్ శంకర్. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.
 
టీమ్ 50 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు దాదాపు 80% ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
 
ఈ చిత్రం 'నామ్ తో సునా హోగా' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. దీనికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, అయనంక బోస్ కెమెరా డీవోపీగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments