Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయచూరు ఎన్నికల ప్రచారకర్తగా సినీ దర్శకుడు రాజమౌళి

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (13:22 IST)
కర్నాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లాలో ఓటింగ్ శాతం పెంపునకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, ఎన్నికల ప్రచారకర్తగా ఎస్ఎస్ రాజమౌళిని ఎన్నికల సంఘం సిఫార్సు చేయగా, ఆయన కూడా సమ్మతించినట్టు సమాచారం. ఓటు హక్కు విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకునిరావాలని నిర్ణయించారు. అందుకు రాజమౌళి సరైన వ్యక్తి అని భావించిన ఎన్నికల సంఘం ఆయన్ను ఎన్నికల ప్రచారకర్తగా భావించినట్టు నాయక్ తెలిపారు.
 
సినీ దర్శకుడు రాజమౌళి పేరును రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సిఫార్సు చేశామని రాజమౌళి కూడా అందుకు అంగీకరించారని తెలిపారు. రాయచూరు జిల్లా మాన్వి తాలూకాలోని అమరేశ్వర క్యాంపులోనే రాజమౌళి జన్మించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆయనతో ప్రచారం చేయిస్తే పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇందులోభాగంగా, రాజమౌళి ప్రత్యక్షంగా ప్రచారం చేయడంతో పాటు వీడియో సందేశాల ద్వారా ఓటర్లలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళిపై సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ ... దెబ్బకు దిగివచ్చి సారీ చెప్పింది... (Video)

గుడికి వెళ్లిన అమ్మ.. అమ్మమ్మ... ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!!

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

వాట్సాప్ గవర్నెన్స్‌లో వెయ్యికి పైగా సేవలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం