ప్యాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో విజయ్ దేవరకొండ 3 స్థానం

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (18:26 IST)
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్‌లో అతనికున్న ఫాలోయింగ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. తెలుగులోనే కాదు నేషనల్ లెవల్లో కూడా విజయ్ సత్తా చాటుతున్నాడు. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువమంది ఫాలోవర్స్ దక్కించుకున్న ఫస్ట్ సౌత్ హీరోగా రికార్డు కొట్టిన విజయ్ ఇప్పుడు మరో మైలురాయి అందుకున్నాడు.
 
ఇండియాలోని టాప్ 50 మెస్ట్ డిజైరబుల్ మెన్‌ల లిస్ట్‌లో విజయ్ ఏకంగా మూడో స్థానం దక్కించుకోవడం విశేషం. మొదటి స్థానంలో షాహిద్ కపూర్, రెండో స్థానంలో రణ్‌వీర్ సింగ్ ఉండగా మిగతా బాలీవుడ్ హీరోలను కిందకు నెట్టి విజయ్ మూడో స్థానం సొంతం చేసుకున్నాడు. 
 
ఇంతకుముందు హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మేన్‌గా వరుసగా 2018, 2019 సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం దక్కించుకున్న రౌడీ స్టార్ ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్లో టాప్ 3 ప్లేస్ కైవసం చేసుకోవటం అతని క్రేజ్‌కు నిదర్శనం.
 
విజయ్ చేసిన సినిమాలకు, తన అటిట్యూడ్‌కు నేషనల్‌వైడ్‌గా ఫ్యాన్స్ అవుతున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌తో విజయ్ దేవరకొండ చేస్తున్న మూవీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments