మోనాల్‌కు దశ తిరిగింది.. హైదరాబాదుకు మకాం మార్చేసింది..

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (10:56 IST)
బిగ్ బాస్ స్టార్ మోనాల్‌కు దశ తిరిగింది. బిగ్ బాస్ హౌజ్‌కు వెళ్ళొచ్చిన తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. బిగ్ బాస్ హౌజ్‌కు వెళ్ళకముందు పలు సినిమాలలో నటించిన మోనాల్ గజ్జర్ పెద్దగా పేరు ప్రఖ్యాతలు పొందలేకపోయింది. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిందో ఈమెకు భలే క్రేజ్ వచ్చేసింది.

కొందరు బిగ్ బాస్ దత్త పుత్రిక అని, మరి కొందరు నర్మదా అని ఇంకొందరు గుజరాతీ బ్యూటీ అని ముద్దుగా పిలుచుకున్నారు. దాదాపు 14వారాల పాటు హౌజ్‌లో ఉండి వచ్చిన మోనాల్ ప్రస్తుతం పలు షోస్‌తో పాటు సినిమాలు కూడా చేస్తుంది. రీసెంట్‌గా అల్లుడు అదుర్స్ అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసినట్టు సమాచారం.
 
ప్రస్తుతం కాల్షీట్స్ ఫుల్ బిజీగా ఉన్న నేపథ్యంలో మోనాల్ తన మకాంను గుజరాత్ నుండి హైదరాబాద్‌కు మార్చనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

రానున్న రోజులలో ఇక్కడో ఫ్లాట్ కూడా కొనాలని మోనాల్ భావిస్తుందట. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న సమయంలో మోనాల్ తన ప్రేమ గురించి కూడా ఓపెన్ అయిన విషయం తెలిసిందే.

మలయాళంలో ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తితో ప్రేమలో పడగా, అది బ్రేకప్ కావడంతో కొన్నాళ్లు డిప్రెషనల్ ఉండిపోయింది మోనాల్‌. బిగ్ బాస్ దయ వలన ప్రస్తుతం మోనాల్ లైఫ్ సాఫీగానే సాగుతున్నట్టు అర్ధమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుపాను.. అప్రమత్తమైన తెలంగాణ.. రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు

Kavitha: కొత్త మేకోవర్‌లో కనిపించిన కల్వకుంట్ల కవిత

Cyclone Montha: మొంథా తుఫాను.. ఏపీ రౌండప్.. సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం

Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)

కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments