Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటీనటులకు లేని సిగ్గుఎగ్గూ మాకేల... ముద్దు సీన్లకు 'సెన్సార్' ఓకే!

చిత్రాల్లో కనిపించే ముద్దు సీన్లపై సెన్సార్ బోర్డు ఒకే చెప్పింది. ఎలాంటి ఘాటు ముద్దులైనా పెట్టుకోండి.. మాకేంటి అనే చందంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ముఖ్యంగా, ముద్దు సీన్లలో నటించే నటీనటులకు, వాటిని

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (15:18 IST)
చిత్రాల్లో కనిపించే ముద్దు సీన్లపై సెన్సార్ బోర్డు ఒకే చెప్పింది. ఎలాంటి ఘాటు ముద్దులైనా పెట్టుకోండి.. మాకేంటి అనే చందంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ముఖ్యంగా, ముద్దు సీన్లలో నటించే నటీనటులకు, వాటిని చూసి ఆనందించే ప్రేక్షకులకు లేని సిగ్గూఎగ్గూ మాకేంటి అంటోంది.
 
తాజాగా, హృతిక్ రోషన్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన 'మొహెంజొదారో' లో రొమాంటిక్ ట్రాక్ తోపాటు మూడు లిప్ లాక్ సీన్లు ఉన్నప్పటికీ.. సెన్సార్ బోర్డు ఆ సినిమాకు ఒక్కటంటే ఒక్క కట్ కూడా చెప్పకపోవడం విశేషం. పైగా, ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. 
 
ఎపిక్ అడ్వెంచర్ డ్రామాగా అశుతోష్ గొవారికర్ తెరకెక్కించిన 'మొహెంజొదారో' ఆగస్టు 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. తమ సినిమా సెన్సార్ చిక్కులను సులువుగా దాటిరావడంతో దర్శకనిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు. సినిమాల్లో ముద్దు సీన్లపై దర్శకనిర్మాతలు, సెన్సార్ బోర్డుకు మధ్య వివాదాలు ఇటీవల తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. 
 
ముఖ్యంగా.. జేమ్స్ బాండ్ సినిమా 'స్పెక్ట్రే', దీపికా- రణ్‌బీర్‌ల 'తమాషా', కాజల్ అగర్వాల్- రణదీప్ హుడాల 'దో లబ్జోంకీ కహానీ' తదితర సినిమాల్లో ముద్దు సీన్లకు సెన్సార్ బోర్డు కత్తెర వేసింది. అదేసమయంలో 'ఉడ్తా పంజాబ్' సినిమా విడుదల సమయంలో సెన్సార్ బోర్డు తీరుపై బాంబే హైకోర్టు అక్షింతలు కూడా వేసింది. 
 
'సీన్లు కత్తిరించడం మీ పనికాదు... సర్టిఫికెట్ జారీ వరకే మీ బాధ్యత. సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకుడి ఇష్టం' అని హైకోర్టు బోర్డును మందలించింది. ఈ మందలింపు నేపథ్యంలోనే 'మొహెంజొదారో' చిత్రానికి ఎలాంటి బ్రేకులు లేకుండా సెన్సార్ సర్టిఫికేట్‌ను మంజూరు చేసినట్టు తెలుస్తోంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pregnant Woman: గర్భిణీపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించిందని రైలు నుంచి తోసేశాడు..

ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ప్రెగ్నెంట్ చేసిన పోలీసు, ఆపై ఫినాయిల్ తాగించాడు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శైలజానాథ్.. కండువా కప్పిన జగన్

వివేకానంద రెడ్డి హత్య కేసు: అప్రూవర్ దస్తగిరిని బెదించారా? విచారణకు ఆదేశం

రూ.10 లక్షలు మోసం- సోనూ సూద్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments