Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో మోహన్ లాల్

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (15:41 IST)
Manchu Vishnu, Mohan Lal
హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా గురించి వస్తోన్న అప్డేట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రోజురోజుకూ కన్నప్ప మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియ సినిమాగా కన్నప్పను మంచు విష్ణు భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుడగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. 
 
మంచు విష్ణు ఈ సినిమాను భారీ ఎత్తున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో కన్నప్ప సినిమా రాబోతోంది. ఈ మూవీలో ప్రభాస్ కూడా ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ ఈ సినిమాలోకి వచ్చారు. మాలీవుడ్ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ సైతం కన్నప్ప సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. ఈ మేరకు మంచు విష్ణు రీసెంట్‌గా మోహన్ లాల్‌ను కలిశారు. ఈ మేరకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. 
 
ప్రస్తుతం కన్నప్ప టీం న్యూజిలాండ్‌లో ఉంది. పరుచూరి గోపాలకృష్ణ,  విజయేంద్ర ప్రసాద్, తోటపల్లి సాయి నాథ్, తోట ప్రసాద్, నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్ రెడ్డి ఇలా అందరూ కలిసి ఈ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచినట్టుగా మంచు విష్ణు తెలిపారు. మున్ముందు మరిన్ని అప్డేట్లతో కన్నప్ప మీద అంచనాలు పెంచబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

Jagan Ganesh Pooja: కొబ్బరికాయ కొట్టడం కూడా జగన్‌కు చేతకాలేదు.. (video)

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments