Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియదర్శి - రూప కొడువాయూర్ జంటగా కొత్త చిత్రం

మురళి
సోమవారం, 25 మార్చి 2024 (14:13 IST)
2016లో నానితో 'జెంటిల్‌మన్' - 2018లో సుధీర్ బాబుతో 'సమ్మోహనం', ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మోహనకృష్ణ ఇంద్రగంటి - శ్రీదేవి మూవీస్ కాంబినేషన్‌లో ఓ చిత్రం ప్రారంభమైంది. ప్రియదర్శి, రూప కొడువాయూర్ ఇందులో హీరో హీరోయిన్లు. శ్రీదేవి మూవీస్ సంస్థలో ప్రొడక్షన్  నెంబర్.15గా రూపొందుతోన్న ఈ చిత్రం సోమవారం (మర్చి 25) ఉదయం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సతీమణి అనిత క్లాప్ ఇవ్వగా, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సతీమణి ఉమా మహేశ్వరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ,"మా శ్రీదేవి మూవీస్ సంస్థకి ఆత్మీయుడు, నాకు అత్యంత సన్నిహితుడైన ప్రతిభాశాలి మోహనకృష్ణ ఇంద్రగంటితో జెంటిల్‌మన్, సమ్మోహనం చిత్రాల తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నందుకు చాల సంతోషంగా ఉంది. 'బలగం'తో హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న ప్రియదర్శికి హీరోగా యాప్ట్ సబ్జెక్ ఇది. తెలుగమ్మాయి రూప కొడువాయూర్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ఇదో క్యూట్ ఫిలిం. స్వీట్ ఎంటర్‍‌టైనర్. చక్కటి వినోదంతో పాటు మంచి భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటి ట్రెండ్‌లో జంధ్యాల సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ సినిమా. ఈ రోజు నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలయింది" అని తెలిపారు.
 
ప్రియదర్శి, రూప కొడవాయూర్, వి.కె. నరేష్. తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, 'వెన్నెల' కిశోర్, 'వైవ' హర్ష, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూపలక్ష్మి, హర్షిణి , కె.యల్.కె.మణి, ఇందులో ప్రధాన తారాగణం. 
 
ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు కాస్ట్యూమ్స్-మనోజ్; కాస్ట్యూమ్ డిజైనర్-రాజేష్-శ్రీదేవి; ప్రొడక్షన్ కంట్రోలర్స్- పి. రషీద్ అహ్మద్ ఖాన్, కె. రామాంజనేయులు; పి.ఆర్.ఓ- పులగం చిన్నారాయణ; కో-డైరెక్టర్- కోట సురేష్ కుమార్; పాటలు- రామజోగయ్య శాస్త్రి; ఫైట్స్- వెంకట్; ప్రొడక్షన్ డిజైనర్- రవీందర్; ఎడిటర్- మార్తాండ్ కె. వెంకటేష్; డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ- పి .జి. విందా; సంగీతం- వివేక్ సాగర్; లైన్ ప్రొడ్యూసర్స్ -విద్య శివలెంక, లిపిక ఆళ్ల , నిర్మాత-శివలెంక కృష్ణప్రసాద్; రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments