Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలో బాలయ్య.. బ్రాహ్మిణీపై చేజేసుకున్న మనోజ్.. ఏమైందంటే?

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (15:35 IST)
ఆహా ఓటీటీలో తొలిసారిగా బాలయ్య హోస్ట్ గా ఓ కార్యక్రమం ప్రసారం అయ్యింది. దాని పేరు అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే. బాలయ్య ఈ షోలో చక్కటి ప్రదర్శన కనబర్చాడు. దీపావళి సందర్భంగా ఆయన షో టెలికాస్ట్ అయ్యింది.

తొలి రోజు కార్యక్రమానికి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా మోహన్ బాబు అగిన పలు ప్రశ్నలు ఆసక్తి కలిగించాయి. అటు మోహన్ బాబు చెప్పిన సమాధానాలు కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. షో మొదలుకొని చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగింది. అంతేకాదు.. సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత అంశాలు కూడా ఈ షోలో చర్చకు వచ్చాయి.
 
మరోవైపు ఈ షోలో మోహన్ బాబు, బాలయ్య పిల్లలకు సంబంధించిన విషయాలు కూడా చర్చకు వచ్చాయి. ఒకానొక సమయంలో మోహన్ బాబు కొడుకు మనోజ్.. బాలయ్య కూతురు బ్రహ్మిణిపై చేయి చేసుకున్నాడట. ఈ షో వేదికగా ఆ ఘటన గురించి చర్చించుకున్నారు. మనోజ్, బ్రహ్మిణి చిన్నగా ఉన్నప్పుడు... మనోజ్ బ్రహ్మిణిని కొట్టాడట. వెంటనే తను ఏడ్చుకుంటూ బాలయ్య సతీమణి వసుంధర దగ్గరికి వెళ్లి విషయం చెప్పిందట. వెంటనే వసుంధర వచ్చి మనోజ్ పై కోప్పడిందట.
 
చిన్నప్పుడు వీరిద్దరు ఎలా ఉన్నా.. ప్రస్తుతం మంచి మిత్రులయ్యారట. నిత్యం పలు విషయాల గురించి చర్చించుకుంటారట. పలు మార్లు ట్విట్టర్ వేదికగా బ్రహ్మిణి చేస్తున్న సామాజికి కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించాడు మనోజ్. ఒకానొక సమచంలో బ్రహ్మిణి లేడీ సింగం అంటూ ప్రశంసించాడు. అంతేకాదు.. పలు అంశాల గురించి వీళ్లిద్దరు మాట్లాడుకుంటారని కూడా చెప్పుకున్నారు. అటు ఈ షో పట్ల జనాల నుంచి మంచి స్పందన వస్తుంది. బాలయ్య తొలి ఇంటర్వ్యూతోనే అదరగొట్టాడని చెప్తున్నారు. ఇలాగే మరికొన్ని ఎపిసోడ్లు కొనసాగితే మంచి పాపులారిటీ వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబై నటి జెత్వానీ కేసు : ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసుల వరద!!

ఇపుడు సంపద సృష్టిస్తున్నాం... ప్రజలకు పంచుతాం : భట్టి విక్రమార్క

స్నేహితులతో పందెంకాసి కాల్వలో దూకిన ఆర్మీ జవాన్ గల్లంతు

రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా : అరవింద్ కేజ్రీవాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments