Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్ బాబు, మంచు లక్ష్మి నటిస్తున్న చిత్రం అగ్ని నక్షత్రం

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (15:23 IST)
Mohan Babu, Manchu Lakshmi
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం "అగ్ని నక్షత్రం". విలక్షణ నటుడు సముద్రఖని, మలయాళీ నటుడు సిద్ధిక్,  విశ్వంత్ , జబర్దస్త్ మహేష్ నటీ నటులుగా ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు మరియు లక్ష్మీ ప్రసన్న లు నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం ఈరోజు ఉదయం 9:29 గంటలకు ఘనంగా జరిగింది.
 
తండ్రీ కూతుళ్ళైన కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి మొట్ట మొదటిది సారిగా కలిసి నటించడం విశేషం.మంచి ముహూర్తాన "అగ్ని నక్షత్రం" అనే టైటిల్ రివీల్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు కథ అందించారు. ఇప్పుడు రిలీజ్ అయిన లుక్స్ చూస్తుంటే ఇదొక పోలీస్ స్టోరీ వంటి విభిన్నమైన కథాంశంతో రూపొందింది అని అర్థం అవుతుంది.ఇందులో  విలక్షణ నటుడు సముద్రఖని, మలయాళం లో ఎన్నో విభిన్న పాత్రలు పోశించిన మలయాళ నటుడు సిద్దిక్ విలన్ గా చైత్ర శుక్ల ద్వితీయ ముఖ్య పాత్రలో, విశ్వంత్ కథా నాయకుడిగా, జబర్దస్త్ మహేష్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తుండగా, మధురెడ్డి ఎడిటర్ గా లిజో కె జోస్ సంగీతం, గోకుల్ భారతి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. శర వేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది.
 
నటీ నటులు 
కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, మంచు లక్ష్మి, సముద్రఖని, మలయాళీ నటుడు సిద్ధిక్, విశ్వంత్ , జబర్దస్త్ మహేష్, చైత్ర శుక్ల తదితరులు 
సాంకేతిక నిపుణులు 
బ్యానర్స్ : శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌ టైన్‌మెంట్స్
నిర్మాతలు : డా, మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి 
దర్శకత్వం : ప్రతీక్ ప్రజోష్
సంగీతం: లిజో కె జోస్,
DOP: గోకుల్ భారతి
ఎడిటర్ : మధురెడ్డి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments