మొగలిరేకులు నటుడి రాసలీలలు.. అమ్మాయిలంటే పిచ్చి.. భార్యే చెప్పింది..

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (17:12 IST)
Pavitra Nath
మొగలిరేకులు సీరియల్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సీరియల్‌లో దయా పాత్రలో నటించిన పవిత్రనాథ్‌కు కూడా మంచి పేరు వచ్చింది. అయితే తాజాగా ఆ నటుడిపై రాసలీలల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఆయనపై ఆరోపణలు చేస్తున్నది ఎవరో కాదు.. అతడి భార్య శశిరేఖనే. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేసింది.
 
తన భర్తకు అమ్మాయిలంటే పిచ్చి అని చెప్పింది. అర్థరాత్రి 2-3 అయినా అమ్మాయిలతోనే మాట్లాడుతూనే ఉంటాడు అని చెప్పింది. జాతకాలు చెబుతానని ఎంతోమంది అమ్మాయిలను నేరుగా ఇంటికే తీసుకొచ్చేవాడని.. ఇదేంటని ప్రశ్నిస్తే పలుసార్లు తనపై చేయి చేసుకున్నాడని ఆరోపించింది. పవిత్రనాథ్ ఓ అమ్మాయితో ఎనిమిదేండ్లు ప్రేమాయణం నడిపాడని, అతడి అఫైర్లపై అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపింది. వాటి ఆధారంగా తాను 2012 మార్చి 1న అతనిపై కేసు పెట్టాను అని చెప్పింది.
 
తమకు 2009లో పెండ్లయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పింది. అత్తమామల నుంచి కూడా తనకు మద్దతు లేదని, తనను ఇంట్లోంచి గెంటివేశారని ఆమె ఆరోపించింది. కట్నం కోసం వారు తనను ఎంతో వేధించారని వాపోయింది. తన భర్త ఒక్క రూపాయి కూడా ఖర్చులకు ఇచ్చేవాడు కాదని.. చిన్న పిల్లలతో ఎంతో కష్టపడ్డాను అని చెప్పింది. తాను జాబ్ తెచ్చుకుని పిల్లల్ని పోషిస్తున్నాను అని.. పిల్లల ముఖం చూసి ఇన్నాళ్లూ సంసారం చేస్తూ వచ్చాను అని తెలిపింది. విడాకులు ఇవ్వకుండా తన భర్త వేధిస్తున్నాడని అంది. అతడ్ని అరెస్ట్ చేయాలని కోరింది. అందుకే న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి కార్యాలయానికి వచ్చానని వివరించింది.
 
తమకు రెండు ఇండ్లు ఉన్నాయని.. ఒకటి అతని పేరున ఉంది.. రెండోది తమ ఇద్దరి పేరున ఉందని చెప్పింది. అయితే ఈ రెండు అమ్మేసి పిల్లల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కోరుతున్నానన్నారు. తనకు ఒక్క రూపాయి వద్దు అని .. తన పిల్లలకి దారి చూపిస్తే చాలు అని వేడుకుంటోంది. ప్రస్తుతం పవిత్ర నాథ్‌.. కృష్ణ తులిసి అనే సీరియల్‌లో మల్లికార్ణున్‌ అనే విలన్‌ పాత్రలో నటిస్తున్నాడు.ఆయన దీనిపై స్పందించాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments