Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపిస్టులను శిక్షించరా..? అమ్మాయిని కనాలంటేనే భయంగా వుంది: దివ్యాంక

''మనసుపలికే మౌనగీతం'' సీరియల్ నటి దివ్యాంక మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దేశానికి మహిళలు ముఖ్యం కాదనుకునే పార్టీలకు ఓట్లు వేయడాన్ని మహిళలు ఇక ఆపాలని పిలుపునిచ్చారు.

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (16:35 IST)
''మనసుపలికే మౌనగీతం'' సీరియల్ నటి దివ్యాంక మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దేశానికి మహిళలు ముఖ్యం కాదనుకునే పార్టీలకు ఓట్లు వేయడాన్ని మహిళలు ఇక ఆపాలని పిలుపునిచ్చారు.

మహిళలపై వావివరుసలు లేకుండా, వయోభేదం లేకుండా కామాంధులు విరుచుకుపడుతుంటే మేము ఎందుకు ఓటేయాలని అడిగారు. మనం ఏ స్వతంత్ర్యం గురించి మాట్లాడుకుంటున్నాం.. రేపిస్టులు స్వేచ్ఛగా తిరుగుతున్న లోకంలో జీవిస్తున్నామా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 70 ఏళ్ల స్వాతంత్ర్యం ఇంకా తమకు స్వేచ్ఛనివ్వలేదని మండిపడ్డారు. 
 
స్వాతంత్ర్య దినోత్సవం రోజునే చండీఘడ్‌లో ఓ వ్యక్తి 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడటంపై దివ్యాంక తీవ్రంగా ఖండించారు. పాఠశాలలో జెండా వందనానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న బాలికపై ఇలాంటి దారుణం చోటుచేసుకోవడంపై దేశంలో మహిళల భద్రతను ఉద్దేశించి దివ్యాంక ట్విటర్‌లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లను కనాలంటేనే భయంగా ఉందన్నారు. ప్రస్తుతం అమ్మాయిని కాపాడటంలో ''భేటీ బచావో'' కార్యక్రమం ఏమైంది? అడిగారు. 
 
తనకు కుమారుడికి జన్మనివ్వాలని లేదు. ఇక అమ్మాయిని కనాలంటే భయంగా వుందని దివ్యాంక అన్నారు. ఒకవేళ అమ్మాయిని కంటే స్వర్గం నుంచి ఈ నరకానికి ఎందుకు తీసుకొచ్చావని అడిగితే ఏం చెప్పను అంటూ దివ్యాంక ట్వీట్ చేశారు. క్రూరమైన నేరాలు చేసే వారిని ఎందుకు క్రూరంగా శిక్షించరు?.. ఇకనైనా పార్టీలు మేల్కోవాలని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments