Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ చిత్రంలో విలన్‌గా మైక్ టైసన్?!

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (12:08 IST)
బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్. గత కొంతకాలంగా తన వృత్తికి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన ఇపుడు మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు. అయితే, ఈ బాక్సింగ్ దిగ్గజం త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
తెలుగు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఇటీవలే "ఇస్మార్ట్ శంకర్" చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు విజయ్ దేవకొండతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. "ఫైటర్" అనే పేరుతో తెరకెక్కబోయే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను పూరి సిద్ధం చేస్తున్నారు. 
 
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభంకానుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా పూరి తెరకెక్కించనున్నారు. హిందీ చిత్రసీమకు చెందిన ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా హిందీ వెర్షన్‌ను విడుదల చేయడానికి చేతులు కలిపారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయనున్నారు. 
 
అయితే, ఈ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ కోసం పూరి అన్వేషణ చేస్తున్నాడట. ఒకప్పటి బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ విలన్‌గా నటింప చేస్తే ఎలా ఉంటుందా? అని పూరి అండ్ టీమ్ ఆలోచిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. మరి నిజంగా మైక్ టైసన్ నటించడానికి ఓకే చెబితే.. సినిమా మరో రేంజ్‌కి చేరినట్లేనని టాక్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2025 మధ్య నాటికి పోలవరం పూర్తి.. ఆరునెలల్లో..?: చంద్రబాబు టార్గెట్

ఆస్తుల కోసం సోదరులను చంపేసిన 28 ఏళ్ల మహిళ.. ఎక్కడంటే?

ఇకపై ఎన్టీయే ఎలాంటి పరీక్షలను నిర్వహించదు : ధర్మేంద్ర ప్రదాన్

పసుపుమయమైన పరిటాల స్వగ్రామం... గ్రామ సభ్యులందరికీ టీడీపీ సభ్యత్వం!!

టీడీపీలో చేరుతున్న వైకాపా మాజీ మంత్రి ఆళ్లనాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments