Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 3న `మెట్రో` విడుద‌ల‌

ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై `ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను అందించిన‌ సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కిన సినిమా `మెట్రో`. ర‌జ‌ని తాళ్లూరి నిర్మాత‌. ప్రస్తుతం నగరాల

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (14:58 IST)
ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై `ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను అందించిన‌ సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కిన సినిమా `మెట్రో`. ర‌జ‌ని తాళ్లూరి నిర్మాత‌. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న‌ చైన్ స్నాచింగ్‌ల‌ను కళ్ళకు కడుతూ.. తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఇటీవ‌లే రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కి, పోస్ట‌ర్ల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌ఖ్యాత గాయ‌ని గీతామాధురి ఈ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మార్చి 3న విడుద‌ల చేస్తున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌జ‌ని తాళ్లూరి మాట్లాడుతూ..``తెలుగు అనువాదం నాణ్యంగా చేశాం. సాహితి చ‌క్క‌ని మాట‌లు-పాట‌లు అందించారు. సినిమా చూస్తున్నంత సేపూ తెలుగు స్ట్రెయిట్ సినిమా చూస్తున్న‌ట్టే ఉంటుంది. గౌత‌మ్‌ మీన‌న్‌, అలాగే ఏ.ఆర్‌.మురుగ‌దాస్ అంత‌టి ప్ర‌ముఖులు మా సినిమాని ప్ర‌శంసించ‌డం ఆనందాన్నిచ్చింది. మార్చి 3న  సినిమా రిలీజ్ చేస్తున్నాం`` అని అన్నారు. 
 
స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ... ``చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుత‌మైన భావోద్వేగాల‌తో సాగే చిత్ర‌మిది. గౌత‌మ్ మీన‌న్ ప్ర‌శంస త‌ర్వాత ట్రైల‌ర్ చూసి ఏ.ఆర్.మురుగ‌దాస్ అభినందించ‌డం మ‌రింత ఉత్సాహాన్నిచ్చింది. మురుగ‌దాస్ నిర్మించిన `ఎంగేయుమ్ ఎప్పోదుమ్‌` చిత్రాన్ని తెలుగులో `జ‌ర్నీ` పేరుతో అందించి విజ‌యం అందుకున్నాం. ఇప్పుడు ఆయ‌న ప్ర‌శంస పొందిన `మెట్రో` అంత‌కుమించి విజ‌యం సాధిస్తుంద‌న్న ధీమా ఉంది. తెలుగు ఆడియెన్స్‌కు ప్రామిస్సింగ్ సినిమాని అందిస్తున్నాం. మార్చి 3న సినిమా విడుద‌ల చేస్తున్నాం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు చూడ‌దగ్గ సినిమా ఇది` అని అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments