Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్వేతా అవస్తి "మెరిసే మెరిసే"లో అలా మెరిసిపోతుందట

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (15:04 IST)
కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నిర్మాత వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ''మెరిసే మెరిసే''. ఈ చిత్రంలో హుషారు ఫెమ్ దినేష్ తేజ్ హీరోగా నటిస్తుండగా శ్వేతా అవస్తీ హీరోయిన్‌గా నటిస్తోంది. కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. 
 
ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్.కె మాట్లాడుతూ... మెరిసే మెరిసే మూవీ చాలా బాగా వచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఇటీవల విడుదలైన మా సినిమా థీమ్ పోస్టర్, ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. త్వరలోనే ఈ సినిమాలోని పాటలను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాము. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా అవస్తి బాగా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన మా సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని తెలిపారు.
 
నిర్మాత వెంకటేష్ కొత్తూరి మాట్లాడుతూ... సినిమా ఔట్‌పుట్ బాగా వచ్చింది. సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాము. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతోంది. మా మూవీకి మీ అందరి సపోర్ట్ కావాలని అన్నారు.
 
నటీనటులు: దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, కాటలిన్, శశాంక్, నానాజీ. సాంకేతిక నిపుణులు:బ్యానర్: కొత్తూరి ఎంటర్త్సైన్మెంట్స్; నిర్మాత: వెంకటేష్ కొత్తూరి; దర్శకత్వం: పవన్ కుమార్. కె; కెమెరామెన్: నగేష్ బన్నెల్; సంగీతం: కార్తిక్ కొడగండ్ల.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్టిక్ ఐస్ క్రీంలో చనిపోయిన పాము.. ఎంత పెద్ద కళ్ళు..?: ఫోటో వైరల్

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

వలపు వల పేరుతో 36 మందిని బురిడీ కొట్టించిన కిలేడీ!

జడ్జి వద్ద విలపించిన పోసాని... తప్పుడు కేసులతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు...

కాంగ్రెస్ పార్టీలో వుంటూ బీజేపీకి పనిచేస్తారా? తాట తీస్తాం.. వారు ఆసియా సింహాలు: రాహుల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments