Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెహ్రీన్ ముఖంలో మెరుపులు... ఎందుకు?

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (10:17 IST)
నేచరుల్ స్టార్ నాని హీరోగా వచ్చిన చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'. ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. ఈ చిత్రంలో ఈమె నటనకు పెద్దగా మార్కులు పడకపోయినప్పటికీ... అందంతో ఆకట్టుకుంది. ఫలితంగా యువత హృదయాల్లో మంచి మార్కులే కొట్టేసింది. 
 
ఆ తర్వాత ఈ అమ్మడుకి 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్' వంటి హిట్ చిత్రాల‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. వీటి తర్వాత 'కేరాఫ్ సూర్య', 'జవాన్', 'పంతం', 'నోటా' వంటి చిత్రాల్లో నటించినా అవి అపజయాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో తెలుగులో మెహ్రీన్ ప‌ని అయిపోయింద‌నుకున్న స‌మ‌యంలో "ఎఫ్‌2" చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. 
 
దర్శకుడు అనీల్ రావిపూడి తెర‌కెక్కించిన మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం 'ఎఫ్2'లో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న నటించింది. ఇందులో హనీ అనే పాత్రలో అద్భుతంగా నటించింది. ప్రధానంగా తన ప్రియుడిని నానా ఇబ్బందులకు ఫ్రస్ట్రేషన్‌కి గురిచేసే పెత్తనంగల అమ్మాయిగా, హాని పాత్రలో తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ నటనతో మెహ్రీన్‌కి మ‌రిన్ని ఆఫ‌ర్స్ రావ‌డం ఖాయం అంటున్నారు. 
 
ప్రస్తుతం మెహ్రీన్... పులి వాసి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఓ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, బేన్ సంస్థ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ఐదో చిత్రంలో ఈమె క‌థానాయిక‌గా ఎంపిక చేశారు. అలాగే మరో టాలీవుడ్ చిత్రంలో నటించేందుకు ఆమె ఎంపికయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments