మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసే హీరో అవ్వాలనుకున్నాను - హీరో కార్తికేయ

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (20:43 IST)
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో హీరోగా యువతలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తికేయ. ఇక ఇప్పుడు సరికొత్త కిక్ ఇవ్వడానికి మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే 90ML. నేహా సోలంకి హిరోయిన్‌గా కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి యర్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పైన అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు.
 
లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సంధర్భంగా శనివారం చిత్ర‌ యూనిట్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. డైరెక్టర్ అజయ్ భూపతి సినిమా బిగ్ సీడీని లాంచ్ చేశారు. ఇదొక ఫ్యామిలీ ఈవెంట్ లా ఉంది. ఇంతగా సపోర్ట్ ఇచ్చిన అభిమానులకు ముందుగా నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు హీరో కార్తికేయ‌.
 
ఈ సినిమా గురించి చెబుతూ... మొదట దర్శకుడు శేఖర్ వేరే కథ చెప్పారు. ఆ తరువాత ఫస్ట్ హాఫ్ వరకు సెట్ చేసుకున్న 90ML అనే కథ చెప్పారు.
 
మందు తాగకపోతే బ్రతకని ఒక వ్యక్తి అలాగే మందు వాసన అంటే పడని ఒక తండ్రి యొక్క కూతురికి మధ్య నడిచే లవ్ స్టోరీ అనగానే నాకు బాగా నచ్చేసింది. అప్పుడు ఫస్ట్ హాఫ్ ఒక్కటే చెప్పారు. ఒకరోజు ఫోన్ చేసి 90ML టైటిల్ అనగానే డిఫరెంట్‌గా అనిపించింది. అప్పుడే మంచి బడ్జెట్లో సినిమాను నిర్మించాలని సొంతంగా మా హోమ్ బ్యానర్లో సినిమాని నిర్మించడం జరిగింది.
 
మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసి హీరో అవ్వాలని అనుకున్నా. నేను చేసిన ప్రతి సినిమాలో నేను అంత బాగా నటించడానికి కారణం నా దర్శకులు. నా పేరెంట్స్ అలాగే నా బాబాయ్ నా కోసం మరోసారి సపోర్ట్ చేశారు. వీళ్ళే నా బ్యాక్‌గ్రౌండ్. ఆర్ఎక్స్ 100తో డబుల్ ప్రాఫిట్స్ అందుకున్నాము. ఇక ఇప్పుడు సినిమా చూశాక త్రిబుల్ ప్రాఫిట్స్ వస్తాయి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments