Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణ్ బాబు... దీర్ఘాయుష్మాన్ భవ! : తమ్ముడికి అన్నయ్య బర్త్‌డే విషెస్

ఠాగూర్
సోమవారం, 2 సెప్టెంబరు 2024 (10:41 IST)
తన తమ్ముుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణ్ బాబూ.. దిర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ చేశారు. అలాగే తన భార్య సురేఖ, పవన్ కళ్యాణ్‌తో కలిసి గతంలో దిగిన ఫోటోను చిరంజీవి షేర్ చేశారు. చిరంజీవి చేసిన ట్వీట్‌లో.. 
 
"ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో, పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు.. దీర్ఘాయుష్మాన్ భవ!'' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. 
 
నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. శుభాకాంక్షల వెల్లువ 
 
పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజు వేడుకలను సోమవారం జరుపుకుంటున్నారు. ఈ బర్త్‌డే వేడుకలను పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా జనసేనానికి హీరో రామ్ చరణ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేశారు. మా పవర్ స్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చరణ్ ట్వీట్ చేశారు. అలాగే మరో మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
 
కాగా, రామ్ చరణ్ చేసిన పోస్టులో 'మీ బలం, అంకితభావం, అవసరంలో ఉన్నవారి పట్ల కనికరం ఎల్లప్పుడూ నాకు, చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి. మీ నిస్వార్థ పనులు, మీ నాయకత్వం, సామాజిక న్యాయం కోసం వాదించే ప్రజల అవసరాలను తీర్చడంలో అంకితభావంతో దృష్టి సారించడం అద్భుతం. ఆంధ్రప్రదేశ్‌లోని అణగారిన వర్గాల జీవితాలపై సానుకూల ప్రభావం చూపడానికి కృషి చేయడం స్ఫూర్తిదాయకం. దేవుడు మీకు మార్గనిర్దేశం చేస్తూ, ఆశీర్వదిస్తూ మరింత బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను' అని చరణ్ పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికన్ సంస్థ జీఈతో భారత్ డీల్.. 1 బిలియన్ డాలర్ల ఒప్పందం సంతకానికి రెడీ

7,730 మట్టి గణేష విగ్రహాల తయారీ-వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎన్టీఆర్ జిల్లా

ఉత్తర భారతదేశంలో భారీ వర్షం భయంకరమైన విధ్వంసం: వైష్ణోదేవి భక్తులు ఐదుగురు మృతి

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments