Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఢిల్లీకి పోయాడు డ్యాన్స్‌లు.. హస్తినకు వెళ్లాడు హాస్యం' మరిచిపోయాడు అనుకున్నారా.. చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఖైదీ నంబర్ 150. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఆడియో వేడుక శనివారం రాత్రి గుంటూరు వేదికగా జరిగింది. ఇందులో హీరో చిరంజీవి మాట్లాడుతూ... ఓ డైలాగ్‌ను చెప్పారు. దీంతో సభా ప్ర

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (20:53 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఖైదీ నంబర్ 150. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఆడియో వేడుక శనివారం రాత్రి గుంటూరు వేదికగా జరిగింది. ఇందులో హీరో చిరంజీవి మాట్లాడుతూ... ఓ డైలాగ్‌ను చెప్పారు. దీంతో సభా ప్రాంగణమంతా దద్ధరిల్లిపోయింది. ఈలలు, చప్పట్లు, కేకలతో హోరెత్తింది. ముఖ్యంగా అల్లు అర్జున్ అయితే చప్పట్లు కొడుతూనే ఉన్నాడు. చేతితో పేపర్ చింపుతున్నట్టు సైగలు చేస్తూ, చిరు చిపేశారని అన్నాడు.
 
ఇంతకీ మెస్టార్ చెప్పిన డైలాగ్ ఏమంటే... 'రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఢిల్లీకి పోయాడు డ్యాన్స్‌లకు దూరమైపోయాడు. హస్తినా పురానికి పోయాడు హస్యానికి దూరమైపోయాడు. ఈ మధ్య కాలంలో మన మధ్య లేదు, అందుకే మాస్‌కు దూరమైపోయాడని అనుకుంటున్నారేమో. అదే మాసు, అదే క్లాసు. అదే హోరు, అదే జోరు, అదే హుషారు.' 
 
అంతకుముందు చిరంజీవి చిత్రంలో నటించిన, పని చేసిన సాంకేతిక నిపుణులు, దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత గురించి మాట్లాడారు. తనకు నాగబాబు, పవన్ కళ్యాణ్‌ ఇద్దరు సోదరులనేది అందరికీ తెలుసని అయితే మూడో తమ్ముడు కూడా ఉన్నాడన్నారు. తన హృదయానికి అతి దగ్గరగా ఉన్నవాడంటూ సినిమా దర్శకుడు వివి వినాయక్ గురించి చెప్పారు. తన ఇద్దరు సోదరుల సరసన మూడో తమ్ముడంటూ వివి వినాయక్‌ గురించి గొప్పగా చెప్పారు.
 
అలాగే, చిత్రంలో నటించిన హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ను ఆకాశానికెత్తేశారు. ఈ కాజల్ ఈ సినిమా ద్వారా అభిమానులను మరింత ఆకర్షిస్తుందన్నారు. తన అందం చందంతో ఆకట్టుకుంటుందని చెప్పారు. గతంలో ఏ హీరోయిన్‌కు లేని రికార్డును కాజల్ ఈ సినిమా ద్వారా సాధించిందని చిరంజీవి అన్నారు. తండ్రితో చేసిన హీరోయిన్ తిరిగి కుమారుడితో చేయడం గతంలో ఉందని, కానీ కాజల్ మాత్రం తొలుత కొడుకు రాంచరణ్‌తో నటించిన తర్వాత తనతో నటించడం అరుదైన రికార్డు అని కాజల్‌ను కొనియాడారు.
 
ఇకపోతే.. తన 150వ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మించడంపై చిరంజీవి మాట్లాడుతూ 'రామ్‌చరణ్ నిర్మాత అవుతాడని నేను ఊహించలేదు. ఇంత సమర్ధవంతమైన నిర్మాత అవుతాడని కూడా అనుకోలేదు' అంటూ చెప్పారు. చిరంజీవి 150వ సినిమా రావాలని వివిధ వేదికల్లో ఎందరెందరో ప్రముఖులు అన్నప్పుడు, తప్పనిసరిగా నాన్నతో 150వ సినిమాను స్వయంగా నిర్మిస్తానని రామ్‌చరణ్ చెప్పాడని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. 
 
ఎంతో మంది నిర్మాతలు ఉన్నారని, నువ్వే చేయాలా అని తాను అడిగానని, అయితే రామ్‌చరణ్ పట్టుదలతో సినిమా చేశాడని అన్నారు. నటనా హద్దులతో పాటు నిర్మాణ పద్దులు కూడా రామ్‌చరణ్‌కు తెలుసునని అన్నారు. అందుకు ఓ ఉదాహరణ చెబుతూ, 'ధ్రువ' సినిమా షూటింగ్ కోసం బ్యాంకాక్‌లో చరణ్ ఉన్నప్పుడు విదేశాల్లో 'ఖైదీ 150' షూటింగ్ జరిగిందన్నారు.
 
ఆ సమయంలో స్వయంగా రామ్‌చరణ్ ఎప్పటికప్పుడు ఆ విషయాలు తెలుసుకుని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌లతో మాట్లాడి అందరి అవసరాలు చూసుకున్నాడని అన్నారు. చరణ్ తన టెక్నీషియన్లను బాగా చూసుకున్నాడని, భవిష్యత్తులో మంచి నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా చరణ్ నిలబడతాననే నమ్మకం తనకుందని, అలాగే తనకున్న అగ్ర నిర్మాతల సరసన చరణ్ కచ్చితంగా నిలబడతాడని తాను చెప్పగలనని అన్నారు. 
 
అభిమానుల ఈలలు, చప్పట్లు, కేరింతలు, కోలాహలం విని చాలా కాలమైందని, ఇది ఇంకా సరిపోవడం లేదని చిరంజీవి అన్నారు. అభిమానుల ఈ కోలాహలం చూసి విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్నానా? లేక విశాఖ సముద్ర తీరాన ఉన్నానా? అన్న అనుమానం వస్తోందని అన్నారు. సముద్రం హోరును అభిమానుల హోరు మించిపోయిందని అన్నారు.
 
ఖైదీ డ్రెస్‌లో ఉన్న తన స్టిల్ చూసి ఈ సినిమాకు 'ఖైదీ నెంబర్ 150' పేరు పెట్టండి అని దాసరి నారాయణరావు సూచించారని, ఆయన సూచించినట్టే ఈ సినిమాకు అదే పేరు పెట్టామని, ఈ పేరు సూచించినందుకు ఆయనకు ధన్యవాదాలని అన్నారు. అలాగే కళలను ఆదరించే టి.సుబ్బరామిరెడ్డికి, తనపై అభిమానంతో వచ్చిన కామినేని, ప్రత్తిపాటి పుల్లారావులకు ధన్యవాదాలని ఆయన చెప్పారు. అభిమానులంతా బాస్ ఈజ్ బ్యాక్ అంటుంటే, ఉర్దూ కవి తన కవిత్వంలో ప్రేయసితో చెబుతూ 'మనిద్దరం ప్రేమలో పడి విడిపోయిన తరువాత, మళ్లీ మనం కలిసేంత వరకు ఆ మధ్యలోని కాలమేదీ గుర్తు రావడం లేదు' అన్నట్టు తన పరిస్థితి ఉందని ఆయన చెప్పారు.
 
2007లో 'శంకర్ దాదా జిందాబాద్' తరువాత 2017 మధ్య 'ఖైదీ నెంబర్ 150' సినిమాకు మేకప్ వేసుకునే మధ్య సమయం క్షణంలా గడిచిపోయిందన్నారు. పదేళ్ల తర్వాత కూడా పాతికేళ్ల నాటి ఉత్సాహం తనలో నింపిన శక్తి అభిమానులదేనని ఆయన అన్నారు. అదే తనను నడిపిస్తున్న శక్తి అని ఆయన చెప్పారు. ఈ సినిమా కథ కోసం అన్వేషించినప్పుడు విన్న కథలు పూర్తి ఆనందాన్నివ్వలేదని, కొన్ని కథలు బాగున్నా ఎందుకో ఆకట్టుకోలేదని అన్నారు. 
 
'కత్తి' సినిమా చూసినప్పుడు ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. ఈ సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయని, మంచి సందేశం ఉందని ఆయన తెలిపారు. తమిళ్ హీరో విజయ్, మురుగదాస్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కథ అనుకోగానే వినాయక్‌ను దర్శకుడుగా పెట్టుకోవాలని అనుకున్నానని, ఆయన కూడా ఆనందంగా అంగీకరించారని చిరంజీవి తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments