కుటుంబంతో కలిసి ఓజీ చూశాను : చిరంజీవి

ఠాగూర్
మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (16:07 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించి తాజా చిత్రం "ఓజీ". ఈ సినిమాను మెగా కుటుంబమంతా కలిసి వీక్షించిన విషయం తెలిసిందే. సినిమా చూసిన అనంతరం అగ్ర కథానాయకుడు చిరంజీవి ఈ సినిమాపై పూర్తి రివ్యూ ఇచ్చారు. తన అభిమానులకు కావాల్సిన వినోదాల విందును పవన్ ఈ సినిమాతో ఇచ్చారని తెలిపారు. కుటుంబంతో పాటు, 'ఓజీ' మూవీ యూనిట్‌తో కలిసి థియేటరులో దిగిన ఫొటోలను చిరంజీవి పంచుకున్నారు. 
 
'నా కుటుంబంతో కలిసి ఓజీ చూశాను. చిత్రంలోని ప్రతి అంశాన్ని పూర్తిగా ఆస్వాదించాను. హాలీవుడ్ ప్రమాణాలకు తగినట్లు ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు. అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ చిత్రమిది. భావోద్వేగాలకు లోటులేకుండా రూపొందించారు. ప్రారంభ సన్నివేశం నుంచి క్లైమాక్స్ వరకూ ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు సుజీత్ అసాధారణరీతిలో రూపొందించాడు. పవన్ కల్యాణ్‌ను తెరపై ఇలా చూడడం చాలా గర్వంగా అనిపించింది. 
 
తన ప్రత్యేక ఆకర్షణతో సినిమాను నిలబెట్టాడు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోన్న అభిమానులకు 'ఓజీ'తో సరైన విందు ఇచ్చాడు. తమన్ ఈ చిత్రానికి ఆత్మతో సమానం. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. చిత్రబృందానికి నా అభినందనలు' అని చిరు తన పోస్టులో రాసుకొచ్చారు. 
 
ఇక ఈ సినిమా విడుదలైన నాడు కూడా చిరంజీవి పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌ను అందరూ 'ఓజాస్ గంభీర'గా సెలబ్రేట్ చేసుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. తమన్ సంగీతం అద్భుతంగా ఉందని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

woman: భార్యాభర్తలు తప్పతాగారు.. కొట్టుకున్నారు.. గొంతులో కత్తితో పొడిచేసింది..

వామ్మో... రెస్టారెంట్లోకి దూసుకు వచ్చిన చిరుతపులి (video)

ఐదేళ్ల కుమార్తెను కాటేసిన తండ్రి... మరణించేంత వరకు జైలుశిక్ష

చికెన్ అడిగిన కన్నబిడ్డలను కొట్టిన తల్లి.. కొడుకు మృతి.. ఎక్కడ?

జస్ట్ రూ. 500 కూపన్ కొనండి, రూ. 15 లక్షల ఇల్లు సొంతం చేసుకోండి, ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments