Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాల్తేరు వీరయ్య నుండి మెగాస్టార్ చిరంజీవి మాసియెస్ట్ థియేటర్ స్టాండీ విడుదల

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (16:39 IST)
Waltheru Veeraya Theater Stand
మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సంక్రాంతి 2023 ఫిలిం వాల్తేరు వీరయ్య. దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మెగా ఎంటర్ టైనర్ ను గ్రాండ్ కాన్వాస్ లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. చిరంజీవి- రవితేజ కాంబినేషన్ ని బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ప్రేక్షకులు ఆత్రుత గా ఎదురుచూస్తున్నారు
 
ఇటీవల విడుదలైన రవితేజ టీజర్ యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ తో ట్రెండింగ్ లో ఉంది. బాస్ పార్టీ పాట 25 మిలియన్ల కంటే ఎక్కువ వీక్షణలను సంపాదించింది మరియు సోషల్ మీడియా ట్రెండింగ్ రీల్స్ లో నిలిచింది.
 
ఇప్పుడు, మేకర్స్ అనూహ్య రీతి లో అవుట్ డోర్ ప్రమోషన్ లకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లకు స్టాండీలను పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
స్టాండీస్ పై  ఉండే పోస్టర్ ను విడుదల చేశారు. పోలీసు స్టేషన్ లో ఒక భారీ యాక్షన్ సన్నివేశం నుండి మెగాస్టార్ చిరంజీవి స్టిల్ ని విడుదల చేయడం జరిగింది . ఇందులో వీరయ్య గా మెగాస్టార్ చిరంజీవి ఒక చేతికి సంకెళ్లతో బ్యాగ్రౌండ్ లో తుపాకీలతో గంభీరంగా కూర్చుని కనిపిస్తున్నారు.
 
స్టైలిష్ ఇంకా భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం మేము సిద్ధంగా ఉన్నామని మెగాస్టార్ యొక్క స్వాగ్ వాగ్దానం చేస్తుంది. మసాలా జోడించి, థియేటర్ల లో ఈ ఎపిసోడ్ కి 'పూనకాలూ గ్యారెంటీ' అనే విధం గా డైరెక్టర్ బాబీ ట్విట్టర్ లో ఈ స్టిల్ ని విడుదల చేశారు. ప్రేక్షకులు మరియు మెగా ఫ్యాన్స్ ఇంకెంతమాత్రం వెయిట్ చేయలేము అంటూ స్పందించారు.
 
సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది మరియు చివరి పాటను ప్రస్తుతం చిరంజీవి మరియు శృతి హాసన్ లపై యూరప్ లో చిత్రీకరిస్తున్నారు. వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాటర్ వరల్డ్‌లోపడిన ఆరేళ్ల బాలుడు... ఆస్పత్రికి తరలించేలోపు...

పోసాని కృష్ణ మురళిపై సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ ... దెబ్బకు దిగివచ్చి సారీ చెప్పింది... (Video)

గుడికి వెళ్లిన అమ్మ.. అమ్మమ్మ... ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!!

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments