Webdunia - Bharat's app for daily news and videos

Install App

గగన్ నారంగ్‌తో సైరా.. షూటింగ్ టెక్నిక్స్ కోసమేనా...?

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (15:42 IST)
ఒలంపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్‌తో మెగాస్టార్ చిరంజీవి గురువారం సమావేశమయ్యారు. నారంగ్‌ని త‌న ఇంటికి ఆహ్వానించిన చిరు ఆయనతో గంటకు పైగా భేటీ కావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ప్రస్తుతం చిరంజీవి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చిత్రం "సైరా నరసింహా రెడ్డి"లో నటిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవ‌ల జార్జియాలో షూటింగ్ జ‌రుపుకుంది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కించారు. చిన్న బ్రేక్ త‌ర్వాత హైద‌రాబాద్‌లో త‌దుప‌రి షెడ్యూల్ జ‌ర‌ుగ‌నుంది. 
 
ఈ నేపథ్యంలో షూట‌ర్ గ‌గ‌న్ నారంగ్‌ని తన ఇంటికి పిలిచి చిరంజీవి చ‌ర్చ‌లు జ‌రిపారు. సైరా చిత్రీక‌ర‌ణ‌ కోసం షూటింగ్‌కి సంబంధించిన ప‌లు టెక్నిక్స్ నేర్చుకోవ‌డానికి గ‌గ‌న్ నారంగ్‌ని త‌న ఇంటికి ఆహ్వానించినట్టు సమాచారం. ఈ విషయాన్ని గగన్ నారంగ్ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. చిరంజీవిని కలవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంటూ సైరాతో దిగిన ఫోటోని షేర్ చేశారు. 
 
కాగా, వచ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల కానుండ‌గా, ఇందులో నయనతార, తమన్నా, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments