Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్జిరెడ్డి చిత్ర యూనిట్‌కు మెగాస్టార్ చిరంజీవి పొగడ్తలు

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (19:50 IST)
విద్యార్థి విప్లవోద్యమ నాయకుడు జార్జిరెడ్డి కథతో తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి. ఈ నెల 22న విడుదల కాబోతోన్న ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. జార్జిరెడ్డి అనే పేరుతో తనకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు. అలాగే సినిమాలో కీలకంగా వచ్చే ‘అడుగడగుడు మా ప్రతి అడుగూ నీ వెనకాలే మా పరుగు’ అనే పాటను విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘నేను ఒంగోలులో ఇంటర్మీడియొట్ చదువుకుంటున్నప్పుడు మొదటిసారి జార్జిరెడ్డి గురించి విన్నాను. ఇన్నాళ్లకు మీ సినిమా జార్జిరెడ్డి ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అనే మీ సినిమా ద్వారా మరోసారి వింటున్నాను. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. మార్పు కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆయన. తప్పును ప్రశ్నించే అలాంటి వాళ్లు అక్కడి నుంచి ఇంకా చాలామంది వచ్చారు. ఈ పాట చూసిన తర్వాత నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. 
 
జార్జిరెడ్డి ఎలాంటి ఆశయాలతో ఉండేవాడు.. ఏ రివల్యూషనరీ థాట్స్ ఎలా ఉండేవి.. తప్పును ప్రశ్నించడం కోసం విద్యార్థి సంఘాలను పెట్టి అన్యాయాలను ఎదుర్కొన్నాడు అనేది ఈ పాటతో తెలుస్తుంది. అలాగే సినిమాను కూడా చాలా చక్కగా తీశారు. ఇలాంటి సినిమాలు రావాలి. జార్జిరెడ్డి బాటలో ఈ యూనివర్శిటీ నుంచి చాలామంది వచ్చారు. జార్జిరెడ్డి వంటి అగ్రెసివ్ వ్యక్తుల కథలు ఇంకా రావాలి. ఈ సినిమా మీ అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి సినిమా తీసిన యంగ్ టీమ్ దర్శకుడు జీవన్ రెడ్డి, డివోపి సుధాకర్ రెడ్డి, నిర్మాతలు సంజయ్ రెడ్డి, అప్పిరెడ్డి, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్‌లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’’ అని అన్నారు.
 
ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ సినిమా కోసం పరిశ్రమ మొత్తంగా ఆసక్తిగా చూస్తోంది. ‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీమంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. జార్జిరెడ్డిగా సందీప్ మాధవ్ నటించిన ఈ మూవీలో ప్రముఖ హీరో సత్య దేవ్ ఓ ప్రధాన పాత్రలో నటించాడు. ఇతర పాత్రల్లో ముస్కాన్,మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్, అభయ్,మహాతి ఇతర నటీనటులు.
 
సాంకేతికవర్గానికి విషయానికి వస్తే... సంగీతం -సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్- ప్రతాప్ కుమార్, ఆర్ట్- గాంధీ నడికుడికార్, కాస్టూమ్స్- సంజనా శ్రీనివాస్, ఫైట్స్ -గణేష్, ఆర్కే, అసిస్టెంట్ రైటర్స్- యాకుబ్ అలీ, అనిల్. స్టిల్స్ -వికాస్ సీగు, సౌండ్ డిజైన్-ఖలీష, రాహుల్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్- హర్షవర్ధన్ రామేశ్వర్; పి ఆర్ వో: జిఎస్ కె మీడియా; కో డైరెక్టర్ -నరసింహారావు, అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ : దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి. కో ప్రొడ్యూసర్: సంజయ్ రెడ్డి; నిర్మాత: అప్పిరెడ్డి; రచన-దర్శకత్వం- జీవన్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. మద్దతు పలికిన అజిత్ పవార్

పుష్ప 2 ఎప్పుడొస్తుందా చూద్దామని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా: అంబటి రాంబాబు (video)

విమానంలో విషపూరిత పాములు... వణికిపోయిన ప్రయాణికులు

స్పేస్ ఎక్స్ విమానంలో భూమికి తిరిగిరానున్న సునీత-విల్మోర్‌

చెవిరెడ్డి కూడా నాకు చెప్పేవాడా? నేను వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకోలేరు: బాలినేని కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments