Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రారంభమైన మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (18:26 IST)
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్.వి.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై మోహన్ రాజా దర్శకత్వంలో ఆర్.బి.చౌదరి, ఎన్.వి. ప్రసాద్ నిర్మించనున్న మెగాస్టార్ 153వ చిత్రం బుధవారం ఉదయం ఫిలిం నగర్ సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. 
 
ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అశ్వినీదత్, డివివి దానయ్య, నిరంజన్ రెడ్డి, చిత్ర సంగీత దర్శకుడు తమన్, మెగా బ్రదర్ నాగబాబు, కొరటాల శివ, ఠాగూర్ మధు, జెమినీ కిరణ్, రచయిత సత్యానంద్, మెహర్ రమేష్, బాబీ, రామ్ ఆచంట, గోపి ఆచంట, మిర్యాల రవీందర్ రెడ్డి, నవీన్ యెర్నేని, శిరీష్ రెడ్డి, యూవి క్రియేషన్స్  విక్కీ తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ, ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. మన నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క స్క్రిప్టును మోహ‌న్ రాజా అద్భుతంగా స్క్రిప్ట్ సిద్ధం చేసారు. మెగాస్టార్ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ సినిమాగా ఇది నిలుస్తుంది'' అన్నారు. 
 
ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అయన అభిమానులు కోరుకునే రేంజ్‌లో ఈ సినిమా ఉంటుంది. మెగాస్టార్ కెరీర్‌లో మరో భిన్నమైన సినిమా అవుతుంది. ఇది పూర్తిస్థాయి రీమేక్ సినిమా కాదు. ఆ కథను తీసుకుని మెగాస్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్చి తెరకెక్కించబోతున్నాం, మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments