Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సైరా" టీజర్ ఔట్.. గురూజీ ఆగమనం (వీడియో)

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (13:40 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అత్యంత కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బిగ్ బి గురువారం తన 76వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. దీంతో సైరాలో ఆయన పోషించే కీలక పాత్రకు సంబంధించిన లుక్‌తో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అమితాబ్‌ గోసాయి వెంకన్న పాత్రలో కన్పించబోతున్నారు. ఇందులో ఆయన నరసింహారెడ్డికి గురువుగా నటించారు.
 
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గురువు పాత్రలో అమితాబ్‌ ఒదిగిపోయారు. ఆయన లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాలను హాలీవుడ్‌ నిపుణుల ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
 
ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందన్న టాక్ ఇప్పటికే వుంది. ఇందుకోసం ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, అదిరిపోయే గ్రాఫిక్స్‌తో ఈ యుద్ధ సన్నివేశం ఒళ్లు గగురుపొడిచేలా ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈచిత్రానికి అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు.
 
ప్రస్తుతం జార్జియాలో షూటింగ్‌ జరుపుకుంటోంది. అక్కడ షూటింగ్ ముగిసిన తర్వాత మరోసారి హైదరాబాద్‌లో షెడ్యూల్‌ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. కాగా, ఈ చిత్రంలో అమితాబ్‌, నయనతార, విజయ్‌సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్‌ తదితర భాషల్లో సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు (video)

రేణిగుంట: క్యాషియర్ మెడపై కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)

డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్

ప్రేమకు హద్దులు లేవు.. వరంగల్ అబ్బాయి.. టర్కీ అమ్మాయికి డుం.. డుం.. డుం..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాయలసీమ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments