మెగాస్టార్ తనయుడు రాంచరణ్ తేజ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి "రంగస్థలం 1985" అనే పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ చిత్రం సమంత హీరోయిన్
మెగాస్టార్ తనయుడు రాంచరణ్ తేజ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి "రంగస్థలం 1985" అనే పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ చిత్రం సమంత హీరోయిన్‌గా నటించనుంది.
ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తూ, ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌కు పేరును జత చేసి తయారు చేసిన పోస్టరును పోస్ట్ చేశారు. ఆ వెంటనే భారత్‌లో అత్యంత వేగంగా ట్రెండింగ్ అవుతున్న పదాల్లో ఒకటిగా రంగస్థలం నిలిచిపోయింది.
కాగా, ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చుతుండగా, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.