Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నో అనుకుంటాం.. టైమ్ వచ్చినప్పుడు తప్పదు మరి.. సాయి ధరమ్ తేజ్‌కు పెళ్లి?

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (11:55 IST)
Sai Dharam Tej
''ఎన్నో అనుకుంటాం, టైం వచ్చినప్పుడు తప్పదు మరి'' అని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్‌లో ఓ వీడియోని పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో బ్యాచిలర్ హీరోలందరూ కలిసి ఉన్న 'సింగిల్ ఆర్మీ' అనే వాట్సాప్ గ్రూప్ నుంచి నిఖిల్‌, నితిన్‌, రానా.. ఇలా ఒక్కొక్కరు లెఫ్ట్ అయ్యారు. చివర్లో "ప్రభాస్ అన్నా.. సారీ, ఇప్పుడు నా వంతు వచ్చిందంటూ" సుప్రీం హీరో కూడా లెఫ్ట్ అయ్యారు. దీంతో సాయి తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని అభిమానులు భావించారు.
 
తాజాగా అసలు విషయాన్ని బయటపెట్టాడు సాయి ధరమ్. తను నటిస్తున్న తాజా చిత్రం సోలో బ్రతుకు సో బెటర్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా వీడియో షేర్ చేసినట్టు అర్థమైంది. చిత్రం నుండి నో పెళ్ళి అనే సాంగ్ ఇప్పటికే విడుదల కాగా, దీనికి సూపర్భ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు హే ఇది నేనేనా అనే మరో సాంగ్ 26 ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నారు. మొన్నటి వరకు నో పెళ్ళి అన్న విరాట్‌కి అమృతని చూసాక ఏమైంది అని తెలియాలంటే ఆ సాంగ్ వినాల్సిందేనని మెగా హీరో అంటున్నాడు.
 
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. బివిఎస్‌యెన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మే 1వ తేదీన విడుదల కావాల్సిన ఈ మూవీ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే ఈ సినిమాను విడుదల చేయనున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments