Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో మెగా హీరోల వార్... ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడుతారు?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (18:03 IST)
టాలీవుడ్‌లో మెగా హీరోల వార్ మొదలైంది. ఈ సమరంలో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడుతారనే చర్చ ఫిల్మ్ నగర్‌లో ఆరంభమైంది. ఈ సమరం... సినిమా వార్. కేవలం ఒక్కో వారం విరామంతో ముగ్గురు మెగా హీరోలకు చెందిన కొత్త చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో టాలీవుడ్‌లో మెగా హీరోల వార్ మొదలైందనే టాక్ వినిపిస్తోంది.
 
 
టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలకు ఆడియన్స్ లో స్పెషల్ క్రేజ్ ఉంది. చిరంజీవి నుంచి ఈ మధ్యే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ వరకూ ఆల్ మోస్ట్ అందరూ ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు. అయితే వీరంతా ఒకరి సినిమాకు మరొకరి సినిమాతో పోటీ ఉండకుండా సినిమాల రిలీజ్ లను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు వరుసగా ఒక్కోవారం గ్యాప్‌లో ముగ్గురు మెగా హీరోలు పోటీకి రెడీ అవుతున్నారు.
 
గతంలో ఇమేజ్ కోసం పోటీ పడుతున్న హీరోలే తన సినిమాలను పోటీ లేకుండా రిలీజ్ చేసుకుంటుంటే, ఇప్పుడు ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కేవలం ఒక్కో వారం గ్యాప్‌తో ముగ్గురు మెగా హీరోలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. అందరికంటే ముందుగా ఈ నెల 24న సాయిధరమ్ తేజ్ తన కొత్త సినిమా "సుబ్రమణ్యం ఫర్ సేల్" సినిమాతో రెజీనాతో కలిసి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. 
 
ఈ చిత్రం విడుదలైన వెంటనే మరోవారం రోజుల తర్వాత అక్టోబర్ 2వ తేదీన దర్శకుడు క్రిష్ -వరుణ్ తేజ్‌ల కాంబినేషన్‌లో రూపొందిన "కంచె" విడుదల కానుంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నడిచే ఈ సినిమాపై ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
ఆ తర్వాత అంటే అక్టోబర్ 9వ తేదీన "రుద్రమదేవి" విడుదలకానుంది. అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మెగా హీరో అల్లు అర్జున్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను అక్టోబర్ 9న ఖచ్చితంగా విడుదల చేయడానికి గుణశేఖర్ రెడీ అవుతున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

Show comments