'గ్యాంగ్ లీడర్‌'గా నాని పనికిరాడా... నేచురల్ స్టార్‌కి మెగా కష్టాలు

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (11:12 IST)
నేచురల్ స్టార్ నానీ పాపం... కష్టాల్లో పడ్డాడు... అయితే... దానికి కారణం ఆయన తదుపరి సినిమా పేరు మాత్రమే. నానీ ప్ర‌స్తుతం విక్ర‌మ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమాకు "గ్యాంగ్‌లీడ‌ర్‌" అనే టైటిల్‌ను ఫిక్స్ చేయడం జరిగింది. మెగా హీరో చిరంజీవి నటించిన "గ్యాంగ్ లీడర్" టైటిల్‌ని నేచుర‌ల్ స్టార్ నాని నటించబోయే సినిమాకి పెట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మెగా అభిమానులు సోష‌ల్ మీడియాలో నానీపై ట్రోలింగ్‌లు ప్రారంభించారు.
 
'గ్యాంగ్‌లీడ‌ర్' టైటిల్‌ను మెగా వారసుడు రామ్‌చ‌ర‌ణ్ త‌ప్ప మ‌రెవ‌రూ వాడ‌కూడ‌ద‌ని వాదిస్తున్నారు మెగా అభిమానులు. కాగా గ‌తంలో సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా త‌న సినిమాకు ఈ టైటిల్ పెడ‌దామ‌నుకున్నాడ‌నీ, అయితే ఫ్యాన్స్ నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో ఆ ప్ర‌య‌త్నం విర‌మించుకున్నాడ‌ని స‌మాచారం. అయితే ఈ టైటిల్ గురించి ముందుగా మెగా ఫ్యామిలీకి చెప్పిన త‌ర్వాతే నాని ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని మ‌రికొంద‌రు వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక సినిమా టైటిల్ గురించి ఇలా ట్రోలింగ్‌లు గట్రా చేసేయ‌డం కాస్త కొత్త విష‌య‌మే మరి... వేచి చూద్దాం ఏం జరగనుందో. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమాన ప్రమాదం : భారతీయ కుటుంబానికి భారీ ఊరట

మలేషియాలో చదువుతున్నట్టుగా నమ్మించి ప్రియుడిని పెళ్లి చేసుకుని ఆపై సూసైడ్...

తిరుపతి - నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ - మర ముగ్గురు మావోల హతం

ఐబొమ్మ వెబ్‌సైట్ - బప్పం టివీలు మూసివేత - యజమాని అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments