Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిధరమ్ తేజ్ కోమాలో లేడు ఆరోగ్యంగానే ఉన్నాడు.. నాగబాబు

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (09:54 IST)
మెగా మేనల్లుడు హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యంపై మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చారు. సాయిధరమ్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పుకొచ్చారు. మీ ప్రార్థనలన్ని ఫలించి తేజ్ క్షేమంగా భయటపడ్డాడు’ అని నాగబాబు పేర్కొన్నారు.
 
ఈ నెల 10వ తేదీన రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన సాయిధరమ్.. ప్రస్తుతం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, తేజ్ ఆరోగ్యంపై అభిమానుల‌లో అనేక సందేహాలు నెల‌కొన్నాయి. ఆ మ‌ధ్య జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తేజ్‌.. కోమాలో ఉన్నాడ‌ని, అందుకే ఈవెంట్‌కి నేను వ‌చ్చాన‌ని పవ‌న్ క‌ళ్యాణ్ వెల్లడించారు. 
 
ఆ తర్వాత "రిప‌బ్లిక్'' చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా మాట్లిడిన ద‌ర్శ‌కుడు దేవ్ క‌ట్టా.. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హాస్పిటల్ నుంచి సాయి ధరమ్ తేజ్ చూశాడని అన్నాడు. యాక్సిడెంట్ తర్వాత ఆయనను వెళ్లి కలిసి మాట్లాడి వచ్చానని.. సాయిని కలిసిన తర్వాతే అక్టోబరు 1న సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించామని తెలిపారు. పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు కోమాలో ఉన్నాడు అని చెప్ప‌గా, దేవ్ క‌ట్టా మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాడ‌ని అంటున్నారు.
 
వీటిపై అభిమానుల‌లో గంద‌ర‌గోళం నెల‌కొన‌గా, తాజాగా మెగా బ్ర‌ద‌ర్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్‌చాట్ చేసిన ఆయనను మెగాభిమానులు సాయితేజ్ ఆరోగ్యం గురించి తెలిపాలని కోరారు. ‘ప్రస్తుతం తేజ్ ఆరోగ్యంగానే ఉన్నాడు. అతి త్వరలోనే మళ్లీ మనముందుకు వస్తాడని తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments