Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్త ఆధ్వ‌ర్యంలో మెగా బ్లడ్ డ్రైవ్-2017

మెగాస్టార్ చిరంజీవి 40 సంవత్సరాల సినిమా సేవలను కొనియాడుతూ చిరంజీవి రక్తదాన సేవలకు సంఘీభావాన్ని తెలుపుతూ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రానున్న 40 రోజుల్లో 40 రక్తదాన శిబిరాలను నిర్వహించాలని విజయ్ రేపల్లె గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకు

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (21:23 IST)
మెగాస్టార్ చిరంజీవి 40 సంవత్సరాల సినిమా సేవలను కొనియాడుతూ చిరంజీవి రక్తదాన సేవలకు సంఘీభావాన్ని తెలుపుతూ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రానున్న 40 రోజుల్లో 40 రక్తదాన శిబిరాలను నిర్వహించాలని విజయ్ రేపల్లె గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వర్జీనియా రాష్ట్రంలోని స్టెర్లింగ్ నగరం ఇనోవా హాస్పిటల్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చిరంజీవి అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 మంది దాతలు ర‌క్త‌దానం చేశారు.
 
అఖిల భారత చిరంజీవి యువత అభిమాన సంఘం అధ్యక్షులు స్వామి నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే  ఇనోవా బ్లడ్ డొనేషన్స్ స్టెర్లింగ్ హాస్పిటల్స్ మేనేజర్ AJ చిరంజీవి బ్లడ్ బ్యాంకు గురించి ప్రస్తావించి, బ్ల‌డ్ బ్యాంక్ సేవలను కొనియాడారు. ఈ స‌మ‌యంలో చిరంజీవి అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం మ‌రింత రెట్టింపయ్యిందని తెలిపారు.
 
ఈ కార్యక్రమాన్ని విజయ్ రేపల్లె గారు అమెరికాలోని ఆప్త సంస్థ ఆధ్వర్యంలో అక్కడున్న చిరంజీవి అభిమానుల సహాయంతో కుటుంబ  కార్యక్రమంగా నిర్వహించడంతో అధిక శాతం  మహిళలు, చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే వేదిక‌పై అఖిల భారత చిరంజీవి యువత అభిమాన సంఘం అధ్యక్షులు స్వామి నాయుడు పుట్టిన రోజు వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments