Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీమ్‌ స్టార్‌ గద్వాల్ బిడ్డ కన్నుమూత.. నువ్వెనివో నాకు తెల్వదు.. అంటూ?

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (10:39 IST)
Mallikarjun
మీమ్స్‌తో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలుగా మారారు. అయితే అలానే పాపులర్‌ అయిన 'గద్వాల్‌ బిడ్డ' కన్నుమూశాడనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 'నువ్వెనివో నాకు తెల్వదు..' అంటూ కోట్లాది మందికి పరిచయం అయిన ఆ చిన్నారి ఇక లేడనే వార్త మీమ్స్‌ ప్రేమికులందరికి షాక్‌ ఇచ్చింది. 
 
అతడు ఆస్తమాతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని సౌత్‌ ఇండియన్‌ థగ్స్‌ అనే పేజీ నుండి మెసేజ్‌ వైరల్‌ అయ్యింది. మల్లికార్జున్‌ స్వగ్రామం జోగులాంబ గద్వాల్‌ జిల్లాలోని వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నె. ఇవాళ మల్లికార్జున్‌ అంత్యక్రియలు జరగనున్నాయి.
 
ఇలా పాపులర్‌ అయినవాళ్లలో ఒకరు చిన్నారి 'గద్వాల్‌ బిడ్డ'. కొన్నేళ్ల కిందట దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ప్రకటించిన ఓ టైటిల్‌ దుమారం చెలరేగింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గద్వాల్‌ బిడ్డ చేసిన వీడియో అప్పట్లో తెగవైరల్‌ అయ్యింది. 
 
తనను గద్వాల్‌ బిడ్డగా పరిచయం చేసుకున్న ఆ చిన్నారి.. ఆర్జీవి ప్రకటించిన టైటిల్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వీడియో చేశాడు. ఆ సమయంలో దళితులను కించపర్చేలా వ్యవహరించాడంటూ దళిత కమ్యూనిటీలు ఆ చిన్నారిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. 
 
మైనర్‌ కావడంతో పోలీసుల సమక్షంలో అతనితో క్షమాపణలు చెప్పించారు. కాగా ఆ సమయంలో అతని సంభాషణలు, ఏడుపు సైతం వైరల్‌గా మారింది.
 
అప్పటి నుండి కాస్తా సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న.. అతని వీడియోలు మాత్రం మీమ్స్‌ క్రియేటర్లకు పని కల్పించాయి. మీమ్స్‌ టెంప్లేట్‌, స్టిక్కర్స్‌, ట్రోల్‌ వీడియోల్లో వైరల్‌ అయ్యాడు.
 
అయితే మీమ్స్‌ స్టార్‌ మృతిచెందిన వార్త.. ఇప్పుడు సోషల్‌ మీడియాను కుదిపేస్తోంది. గద్వాల్‌బిడ్డ అసలు పేరు మల్లికార్జున్‌రెడ్డి అని సమాచారం. ఇటీవల ఆ చిన్నారి ఓ సినిమాలో నటించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడాలి నానికి ఛాతిలో నొప్పి.. హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి తరలింపు!!

భార్యతో వివాహేతర సంబంధం ఉందని భర్త ఘాతుకం... యోగా టీచర్‌ను సజీవంగా పాతిపెట్టాడు...

Perni Nani: పార్లమెంటును దుర్వినియోగం చేసిన టీడీపీ.. లావువి లేనిపోని ఆరోపణలు- పేర్ని ఫైర్

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments