Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం: ప్రముఖులకు నోటీసులు.. మాకేపాపం తెలియదంటూ..?

టాలీవుడ్‌లో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. ఇప్పటికే డ్రగ్స్ దందాలో మొత్తం 40 మంది టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల పేర్లు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం 12 మందికి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ

Webdunia
శుక్రవారం, 14 జులై 2017 (11:47 IST)
టాలీవుడ్‌లో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. ఇప్పటికే డ్రగ్స్ దందాలో మొత్తం 40 మంది టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల పేర్లు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం 12 మందికి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, తొలుత అరెస్ట్ అయిన కెల్విన్ నుంచి పూరీ జగన్నాథ్ స్వయంగా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసే వాడని పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. 
 
పూరీ డ్రగ్స్ కొన్నట్టు స్పష్టమైన ఆధారాలు వుండగా, ఆయన నుంచి హీరోయిన్ చార్మీ, క్యారెక్టర్ నటుడు సుబ్బరాజులకు ఇచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇక జీశాన్ అనే నైజీరియన్ నుంచి హీరో రవితేజకు పలుమార్లు డ్రగ్స్ వెళ్లాయని సిట్ అధికారులు నిర్ధారించుకున్నారు. ఆ తరువాతే రవితేజకు నోటీసులు పంపారని సమాచారం. రెండో జాబితా ప్రకారం నోటీసులు పంపేందుకు ఎక్సైజ్ రెడీ అవుతోంది. ఈ కేసులో తొలుత అరెస్ట్ అయిన కెల్విన్ సహా పలువురి కాల్ డేటాలో వీరందరి నంబర్లు ఉన్నాయి. 
 
అయితే ఇప్పటికే రవితేజ, నందు, నవదీప్, ముమైత్ ఖాన్, పూరీ జగన్నాథ్, ఛార్మీలకు ఎక్సైజ్ నోటీసులు పంపినట్లు టీవీల్లో వార్తలు వస్తున్నాయి. కానీ వీరందరూ తమకే పాపం తెలియదంటున్నారు. తన భర్త నందుకు సిట్ పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయని మీడియాలో వార్తలు చూసి అవాక్కయ్యానని అంది. నందుకు ఎటువంటి చెడు అలవాట్లూ లేవని స్పష్టం చేసింది. నందు కూడా ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశాడు. నవదీప్‌ను కాపాడేందుకు ఐదుగురు అగ్రహీరోలు రంగంలోకి దిగినట్లు సమాచారం. తాను సిగరెట్ కూడా తాగనని తనకు నోటీసులేంటి అంటూ ఆర్ట్ డైరక్టర్ చిన్నా అన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments