Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవి కోసం థియేటర్ల వద్ద క్యూకట్టిన అభిమానులు

'ఫిదా'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు సాయిపల్లవి. తెలంగాణా యాసలో అందరినీ ఆకట్టుకునేలా సినిమాలో ఆమె చెప్పిన డైలాగ్‌లు అందరినీ కట్టిపడేశాయి. యువ హీరోయిన్లలో ఇప్పుడు టాప్ సాయిపల్లవే. ఫిదా తరువాత ఆమె నటించిన సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయి. నానితో కలిసి

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2017 (21:14 IST)
'ఫిదా'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు సాయిపల్లవి. తెలంగాణా యాసలో అందరినీ ఆకట్టుకునేలా సినిమాలో ఆమె చెప్పిన డైలాగ్‌లు అందరినీ కట్టిపడేశాయి. యువ హీరోయిన్లలో ఇప్పుడు టాప్ సాయిపల్లవే. ఫిదా తరువాత ఆమె నటించిన సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయి. నానితో కలిసి నటించిన ఈ సినిమా ఈ నెల 21వ తేదీన విడుదలై భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో సాయిపల్లవిని చూసేందుకు అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. థియేటర్ల వద్ద ఏ అభిమానిని అడిగినా సాయిపల్లవి ఈ సినిమాలో ఉందిగా అందుకే సినిమా చూడటానికి వచ్చాము అని చెబుతున్నారు.
 
మరోవైపు నాని కోసం కాలేజీ అమ్మాయిలు థియేటర్లకు భారీగా వస్తున్నారు. దీంతో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను రాబడుతోంది. 21వ తేదీ మొదటిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లోను 12 కోట్ల 26 లక్షల రూపాయల వసూళ్ళను రాబట్టింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల రూపాయలను వసూలు చేసింది. విదేశాల్లో కూడా సినిమా భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. అభిమానుల అంచనాను మించి సినిమా ఉండటంతో అభిమానులు థియేటర్ల వద్ద క్యూకడుతున్నారు. ఏ షో చూసినా హౌస్‌ఫుల్ బోర్డే కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments