Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటున్న దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా

డీవీ
మంగళవారం, 20 ఆగస్టు 2024 (18:19 IST)
Dilip Prakash and Regina Cassandra
దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా 'ఉత్సవం'. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
ఈ రోజు 'ఉత్సవం' నుంచి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ సాంగ్ ని రిలీజ్ చేశారు. స్టార్ కంపోజర్ అనూప్ రూబెన్స్ ఈ పాటని బ్యూటీఫుల్ సిగ్నేచర్ మెలోడీగా కంపోజ్ చేశారు. ట్యూన్ విన్నవెంటనే కనెక్ట్ అయ్యేలా వుంది. సాంగ్ టైటిల్ కి తగ్గటే మ్యారేజ్ వైబ్ తో ఆర్కెస్ట్రా రైజేషన్ అద్భుతంగా వుంది. 
 
అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ ఈ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. అర్మాన్ మాలిక్ తన వోకల్స్ తో మెస్మరైజ్ చేశాడు. ఈ సాంగ్ లో లీడ్ పెయిర్ దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది. 
 
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌.
 
సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. 
 
తారాగణం: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురంలో వితంతువులకు చీరలు పంచిన పవన్ కళ్యాణ్

13న బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో వర్షాలు

నేటి నుంచి తెలంగాణాలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments