Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి వ్య‌వ‌స్థే మ్యాడ్ సినిమాకు కారణం అయిందిః దర్శకుడు లక్ష్మణ్ మేనేని

Webdunia
శనివారం, 31 జులై 2021 (16:50 IST)
Laxman Maineni
ప్రేమ,పెళ్లి, స్నేహం..ఇలా ఏ బంధానికైనా కొంత టైమ్ ఇవ్వాలి అంటున్నారు దర్శకుడు లక్ష్మణ్ మేనేని. ఎదుటివారిపై త్వరగా అభిప్రాయానికి వచ్చి విడిపోవడం ఇవాళ్టి యువతలో ఎక్కువగా జరుగుతోందని ఆయన చెబుతున్నారు. ప్రేమ, పెళ్లి, సహజీవనం వంటి అంశాల నేపథ్యంతో దర్శకుడు లక్ష్మణ్ మేనేని "మ్యాడ్" అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. మోదెల టాకీస్  బ్యాన‌ర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు  మిత్రులు ఈ చిత్రాన్ని నిర్మించారు. "మ్యాడ్" మూవీ ఆగస్టు 6న థియేటర్ లలో విడుదల అయ్యేందుకు రెడీ అవుతోంది.
 
ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ, నేనొక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ను. 2002 నుంచి ఓ కంపెనీ నడుపుతుంటాను. సినిమాకు దర్శకత్వం వహించాలనేది నా కోరిక. అందుకే ఈ రంగలోకి వచ్చాను. నేటి యువత రిలేషన్స్ కు టైమ్ ఇవ్వడం లేదు. త్వరగా ఒకరి మీద ఒకరు అభిప్రాయాలు ఏర్పర్చుకుంటున్నారు. చెట్టు మీద కాయ పండు కావడానికి కూడా ఒక టైమ్ ఉంటుంది. అలాగే ఏ బంధానికైనా కొంత సమయం ఇవ్వాలి. నేను గత కొంతకాలంగా పెళ్లిళ్లు జరుగుతున్న తీరును గమనిస్తున్నా. ఏడాది గడిచేలోపు ఆ జంటలు విడిపోయి, మరొకరితో వివాహం జరుపుకుంటున్నారు. ముందు తరం చూస్తే చాలా జంటలు పెళ్లయ్యాక జీవితాంతం కలిసే ఉండేవారు. ఇప్పుడంత ఓపిక యువ జంటలకు ఉండటం లేదు. ఆ అంశాలే మ్యాడ్ సినిమా రూపొందించేందుకు కారణం అయ్యాయి. ఘనంగా జరిగే పెళ్లిళ్లలో కొత్త జంట ఆ హడావుడిని ఎంజాయ్ చేస్తున్నారు గానీ వాళ్ల మధ్య ఒక అనుబంధం ఏర్పడటం లేదు. ఫిజికల్ గా కలిసి మాట్లాడుకునే స్నేహాలు ఇవాళ తగ్గిపోయాయి, 
 
ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు. మనలో చాలా మందికి ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రెండ్స్ పేర్లు కూడా సరిగా తెలిసి ఉండవు. ప్రేమ, పెళ్లిలో కూడా అటెన్షన్ గ్రాబింగ్ ఎక్కువయ్యింది. వాస్తవమైన ప్రేమలు తగ్గిపోయాయి. పెళ్లి చేసుకుంటే మీ భాగస్వామికి ఏడాది టైమ్ ఇవ్వండి, ఆ ఏడాదిలో మంచి ఉంటుంది, చెడూ ఉంటుంది. కూర్చొని మాట్లాడుకుని పరిష్కారం చేసుకోండి గానీ ఇవాళ గొడవైతే రేపు విడిపోవడం కరెక్ట్ కాదు అని మా మూవీలో చెబుతున్నాం. డివోర్స్ కు రెడీ అయిన ఒక జంట, లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న మరో జంట..ఇలా రెండు జంటల ద్వారా ఈ కథను చూపించాను. ఈ కథలో హీరోలకు జీవితంలో ఏ లక్ష్యం ఉండదు. హీరోయిన్స్ మాత్రం ఒకరు ఆర్టిటెక్చర్ ఉద్యోగిగా, మరొక హీరోయిన్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తారు.

ఇలా భిన్న ధృవాల్లాంటి అమ్మాయిలు, అబ్బాయిలు కలిస్తే వాళ్ల రిలేషన్స్ లో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది ఆసక్తికరంగా రూపొందించాము. నేను స్వతహాగా మ్యూజిక్ లవర్ ను. మ్యాడ్ మూవీలో లవ్ అండ్ రొమాంటిక్ అంశాలతో పాటు మంచి మ్యూజిక్ ఉంటుంది. కైలాష్ ఖేర్, హేమచంద్ర, ఉన్నికృష్ణన్ లాంటి సింగర్స్ పాటలు పాడారు. మోహిత్ రెహ్మానియాక్ కంపోజ్ చేసిన ఆరు పాటలు హిట్ అయ్యాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమా మ్యాడ్. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా. యువతకు బాగా నచ్చే సినిమా అవుతుంది. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments