పుట్టినరోజు ట్వీట్ చేసిన యంగ్ హీరో.. ఫిదా అయిన మెగా ఫ్యాన్స్

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (15:41 IST)
మంచు మనోజ్ మిగతా నటీనటుల విషయంలో ఎప్పుడూ పాజిటివ్‌గా వ్యవహరిస్తుంటారు. నేడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ జన్మదినం సందర్భంగా మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. అయితే ఈ పోస్ట్‌ను ఎంతో వైవిధ్యంగా అనిపించేలా చేయడంలో మెగా ఫ్యాన్స్ దీన్ని చూసి ఫిదా అయిపోతున్నారు. అంతే మనోజ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు మెగా ఫ్యామిలీ అభిమానులు.
 
రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ తన ట్విట్టర్ ఖాతాలో రామ్ చరణ్‌ను కౌగిలించుకున్న ఫొటో, అలాగే పరస్పరం చేతులు కలిపిన ఫోటోను తమ స్నేహానికి గుర్తుగా షేర్ చేస్తూ ‘బంగారం లాంటి నా బ్రదర్ రాంచరణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీకెప్పుడూ ప్రేమాభిమానాలు, ఆనందంతో కూడిన బ్లాక్ బస్టర్ వంటి జీవితం చేకూరాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేసారు. 
 
అయితే ఈ ఫోటోలలో రాంచరణ్ ముఖం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం ఆయన లుక్ లీక్ కాకూదనే ఉద్దేశంతో ఇలా చేసుండొచ్చు. అంతేకాకుండా మనోజ్ పెట్టుకున్న నలుపురంగు టోపీపై RRR అని రాసి ఉంది. అంటే ఫోటోలు ఈ మధ్యకాలంలో తీసుకున్నవే అయ్యుంటాయని అందరూ బావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments