Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేన్సర్‌ను జయించిన తర్వాతే జీవితం విలువ తెలిసింది : మనీషా కోయిరాలా

కేన్సర్‌ వ్యాధిని జయించిన తర్వాతే తనకు జీవితం విలువ తెలిసిందని బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా వ్యాఖ్యానించారు. ఒవేరియన్ కేన్సర్‌తో బాధపడిన మనీషా దానిని నుంచి బయటపడేందుకు చేసిన పోరాటం చూసి కేన్సరే వెనక్కి

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (09:01 IST)
కేన్సర్‌ వ్యాధిని జయించిన తర్వాతే తనకు జీవితం విలువ తెలిసిందని బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా వ్యాఖ్యానించారు. ఒవేరియన్ కేన్సర్‌తో బాధపడిన మనీషా దానిని నుంచి బయటపడేందుకు చేసిన పోరాటం చూసి కేన్సరే వెనక్కి తగ్గింది. కేన్సర్ నుంచి బయటపడ్డాక తిరిగి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన మనీషా... సంజయ్ దత్ బయో‌పిక్‌లో నర్గీస్ దత్ పాత్రలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, "కేన్సర్‌కు ముందు నా జీవితం అంత గొప్పగా ఏమీ లేదు. పెద్దగా పట్టించుకోలేదు కూడా. కానీ కేన్సర్‌తో బాధపడిన తర్వాత జీవితం గురించి తెలిసి వచ్చింది. చాలా కష్టాలు అనుభవించా. బోలెడంత డబ్బు ఖర్చు చేశా. అసంతృప్తి, బాధ, భయం నన్ను ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేశాయి. అందుకే చెబుతున్నా.. జీవితాన్ని ఆనందించండి. దాని విలువను గుర్తించండి. మంచిగా బతకండి. ఎందుకంటే ఈ జీవితం మనకు దక్కిన ఓ బహుమతి" అని మనీషా వ్యాఖ్యానించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...

మూత్ర విసర్జనకు చెట్ల చాటుకి వెళ్లిన మహిళ: ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

ఇంటి నుంచి పారిపోయి దంపతులుగా తిరిగివచ్చిన అక్కాచెల్లెళ్లు

Trump, 146 కోట్ల మంది భారతీయులు అమెరికా కంపెనీలను బహిష్కరిస్తే?: ఆప్ ఎంపీ నిప్పులు

శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోని ఖజానా బి తెరవడంపై మళ్లీ రచ్చ రచ్చ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments