Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడవాళ్లు మీకు జోహార్లు నుండి మాంగ‌ళ్యం పాట విడుద‌ల‌

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (16:40 IST)
Mangalyma song
హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. మార్చి 4న ఈ చిత్రం విడుద‌ల‌కానుంది.
 
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమా బజ్‌ను మ‌రింత‌ పెంచడానికి సహాయపడుతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన మూడు పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ఈ రోజు దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌ర‌ప‌రిచిన నాల్గవ పాట మాంగళ్యం తంతునానేనా విడుదలైంది. ఏస్ కంపోజర్ ఈ చిత్రానికి భిన్నమైన మరియు అద్భుతమైన ట్రాక్‌లను ట్యూన్ చేశారు. ఈ పాట‌ థీమ్, కంపోజ్ చేసిన విధానం, విశేషమైన గానం,  ఫన్నీ లిరిక్స్ అన్నిక‌లిపి ఈ పాట‌ను మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిల‌బెట్టాయి.
 
‘మాంగళ్యం తంతునానేనా’ అనే  శ్లోకాన్ని ఆధునీకరించిన ఈ పాటలో శర్వానంద్ తన చిరాకు  చూపించాడు. దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా రాసిన ఈ పాట‌కు జస్‌ప్రీత్ జాస్ గాత్రం అందించారు. శర్వా డ్యాన్స్ మూమెంట్స్‌ ఈ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.
 
కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ  వంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్‌ క‌లిసి న‌టిస్తుండ‌డం ఈ సినిమాలో మ‌రో విశేషం. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు
 
సాంకేతిక బృందం
దర్శకత్వం: తిరుమల కిషోర్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
సంగీతం, దేవీ శ్రీ ప్రసాద్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
కొరియోగ్రఫర్: దినేష్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments