Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కాంబోలో నేను సినిమా చేయను - మంగళవారం' రేజ్ ముందే ఊహించా : దర్శకుడు అజయ్ భూపతి

Webdunia
సోమవారం, 13 నవంబరు 2023 (17:23 IST)
Ajay Bhupathi
దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమా 'మంగళవారం'. పాయల్ రాజ్‌ పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మతో కలిసి అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ సంస్థ చిత్రాన్ని నిర్మించింది. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి సినిమాలో ప్రధాన తారాగణం. నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా అజయ్ భూపతి మీడియాతో మాట్లాడారు. 
 
'మంగళవారం' ఐడియా ఎప్పుడు వచ్చింది? కథకు స్ఫూర్తి ఏమిటి?
ఐడియా ఎప్పుడు వచ్చిందనేది పర్టిక్యులర్ గా చెప్పలేను. మైండ్ లో చాలా ఐడియాలు రన్ అవుతూ ఉంటాయి. అయితే... 'మహాసముద్రం' చిత్రీకరణలో ఉండగా, మంగళవారం చేయాలని ఫిక్స్ అయ్యాను. మరొక కథపై మనసు వెళ్ళలేదు. ఇంతకు ముందు రెండు సినిమాల కంటే కథ రాసేటప్పుడు, తీసేటప్పుడు ఎక్కువ టెన్షన్ ఫీలయ్యా. కాంటెంపరరీ కథతో క్యారెక్టర్ బేస్డ్ సినిమాగా కమర్షియల్ విలువలతో తీశా. నెక్స్ట్ లెవల్ లో ఎండ్ అవుతుంది. ఇటువంటి సినిమాకు దర్శకత్వం వహించడం అంత సులభం కాదు. ప్రొడక్షన్ అండ్ టెక్నికల్ వేల్యూస్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ వంటివి చాలా ఉంటాయి. విజువలైజేషన్ నాకు తప్ప సినిమాటోగ్రాఫర్ కి కూడా తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా అంతే! సినిమాకు అన్నీ కుదిరాయి. 
 
పాయల్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
ఆమె క్యారెక్టర్ చూసి ప్రేక్షకులందరూ షాక్ అవుతారు. దాంతో పాటు భావోద్వేగాలు కూడా ఉంటాయి. జీవితంలో మళ్ళీ చేయలేనటువంటి పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో చేసింది. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు, మిగతా వాళ్ళు అందరినీ ఒక్క తాటిపైకి తీసుకు రావడానికి నాకు కొంచెం కష్టమైంది. కమర్షియల్ సినిమాలు ఒక మీటర్ మీద వెళతాయి కాబట్టి చేయడం కష్టం కాదు. కానీ, ఇటువంటి సినిమాలు తీయడం కష్టం. 
 
కథానాయికగా ముందు నుంచి పాయల్‌ను అనుకున్నారా?
లేదు. టీనేజ్ ఎండింగ్ లో ఉన్న అమ్మాయితో చేద్దామని అనుకున్నా. ఎటువంటి అంచనాలు లేని కొత్తమ్మాయిని తీసుకుందామని ప్రయత్నించా. సుమారు 40, 50 మందిని ఆడిషన్ చేశా. పెర్ఫార్మన్స్ చేయాలి, ఇన్నోసెంట్ ఫేస్ ఉండాలి, గ్రామీణ నేపథ్యానికి ఆ అమ్మాయి సూటవ్వాలి. ప్రీ ప్రొడక్షన్ టైంలో హీరోయిన్ సెలెక్షన్ కోసం ఎక్కువ టైం పట్టింది. ఆ సమయంలో పాయల్ నుంచి మెసేజ్ వచ్చింది. మళ్ళీ మనం సినిమా చేద్దామని! రెండు రోజులు టైం తీసుకుని నేను విజువలైజ్ చేసుకున్నా. సెట్ అవుతుందా? లేదా? అని! ఆ తర్వాత ఓకే చేశా. 
 
టిపికల్ క్యారెక్టర్ కదా! పాయల్ ను ఎలా ఒప్పించారు?
తనకు నా మీద ఉన్న నమ్మకం. ఆల్రెడీ 'ఆర్ఎక్స్ 100' చేసింది కదా! ఆ సినిమాకు కూడా చాలా మందిని ఆడిషన్ చేశాం. చాలా మందికి కథలు చెప్పాం. అయితే... భయపడ్డారు. అప్పుడు పాయల్ ధైర్యంగా ముందడుగు వేసింది. ఇప్పుడూ అంతే!
 
మహిళలకు సంబంధించిన అంశాన్ని డిస్కస్ చేశానని చెబుతున్నారు. సహజంగా తమ సమస్యలను ఎవరూ బయటపెట్టారు. ఇటువంటి సినిమా చేయడానికి...
రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఎబెట్టు సీన్లు ఉంటాయి. ఇటువంటి డార్క్ థ్రిల్లర్ సినిమాల్లో ఏం ఉండవు. 'ఆర్ఎక్స్ 100' సినిమాలో ఏవేవో ఉంటాయని చాలా మంది ఊహించుకున్నారు. ఆ సినిమాలో ఏముంది? ప్రేక్షకుల మీద క్యారెక్టర్స్ ఇంపాక్ట్ చూపించాలి. అది ముఖ్యం. 'మంగళవారం'లో జీరో ఎక్స్‌పొజింగ్. నా జీవితంలో ఒక్క వల్గర్ షాట్ తీయలేదు. పాయల్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... న్యూడ్ అని కొందరు అన్నారు. కానీ, అందులో గమనిస్తే... కళ్ళలో ఏడుస్తూ ఉంటుంది. ఆ గాఢత చూసే వాళ్ళకు తెలుస్తుంది. ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద దర్శకులు ఫోన్ చేసి 'బ్యాక్ చూద్దామని పోస్టర్ ఓపెన్ చేస్తే కళ్ళ మీదకు తీసుకువెళ్ళావ్' అని అన్నారు. థియేటర్ల నుంచి వచ్చే ప్రేక్షకులు ఏడుస్తూ వస్తారు. ఆమెను చూసి ఫీల్ అవుతారు. 
 
మాస్క్ వెనుక కథ ఏంటి?
పాయల్, నందిత కాంబోలో ఒక్క సీన్ కూడా లేదంట! ట్విస్ట్ అదేనా?సినిమాలో ఒక్క ట్విస్ట్ కాదు, చాలా ఉన్నాయి. మాస్క్ వెనుక ఎవరు ఉన్నారో చూస్తే షాక్ అవుతారు. లాస్ట్ 45 నిమిషాలు నెక్స్ట్ లెవల్ ట్విస్టులు ఉంటాయి. మ్యూజిక్ కూడా అద్భుతం. 'రంగస్థలం' చిత్రానికి నేషనల్ అవార్డు అందుకున్న సౌండ్ డిజైనర్ ఎంఆర్ రాధాకృష్ణ గారు మంగళవారానికి నెక్స్ట్ లెవల్ లో చేశారు. థియేటర్లలో భారీ సినిమా చూస్తున్నట్లు ఉంటుంది.   
 
సంగీత దర్శకుడు అజనీష్ ఛాయస్ ఎవరిది?
వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?సూపర్బ్ మ్యూజిక్ డైరెక్టర్! 'కాంతార' విడుదలైన వారానికి ఆయన దగ్గరకు వెళ్ళా. ఇళయరాజాను మించిన మెలోడీ ఎవరు ఇవ్వలేరు. కొత్త సౌండింగ్ ట్రై చేయమని చెబుతా. 'గణగణ మోగాలిరా' పాటలో కొత్త సౌండింగ్ ఇచ్చారు. ఆరు రోజులు ఆ పాట తీశాం. 400 షాట్స్ ఉంటాయి. థియేటర్లలో పాట వచ్చినప్పుడు పూనకాలు వస్తాయి. నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవల్ ఇచ్చారు. 
 
'అప్పడప్పడ తాండ్ర...' పాట ఫైనల్ కట్ నుంచి తీసేయడానికి కారణం?
చాలా మంది మనోభావాలు దెబ్బ తీసేలా లిరిక్స్ ఉంటాయని సెన్సార్ ఆఫీసర్లు ఫీలయ్యారు. సినిమాకు ఒక్క కట్ కూడా ఇవ్వలేదు. విజువల్ గానీ, సౌండ్ గానీ తీయమని చెప్పలేదు. 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చారు. హారర్ టచ్ ఉన్న సినిమాల్లో సౌండ్ భయపెట్టేలా ఉంటాయని, అందుకని 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చామని చెప్పారు. కానీ, పాటలో లిరిక్స్ మార్చమని అడిగారు. మారిస్తే ఇంపాక్ట్ ఉండదని సినిమాలో నుంచి తీసేశా. రెండు మూడు రోజుల్లో ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేస్తాం.  
 
ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్ నుంచి ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఈ సినిమా రేంజ్ ముందు ఊహించారా?
సినిమా రేంజ్ నేను ముందు ఊహించకపోతే 20 కోట్లు ఖర్చు పెట్టను. మేం పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. అన్ని ఏరియాల బిజినెస్ పూర్తి అయ్యింది. మేం చాలా హ్యాపీ. అజయ్ భూపతి ఇంత ఖర్చు చేస్తున్నాడేంటని బయట వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ, నేను అనుకోలేదు. ఒక షెడ్యూల్ అయ్యేసరికి ఈ సినిమా కెపాసిటీ నాకు తెలిసింది. ఏ దర్శకుడికి అయినా ముందు తెలుస్తుంది. అల్లు అర్జున్ గారికి ఏడాదిన్నర క్రితమే కథ చెప్పాను కాబట్టి ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో ఆయన ఊహించారు. 
 
పల్లెటూళ్లలో ఇంకా డార్క్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా! వాటిని కూడా చూపిస్తారా?
'మంగళవారం' సినిమాకు పొడిగింపు అయితే ఉంటుంది. సీక్వెల్, ప్రీక్వెల్, ఫ్రాంచైజీ... ఏం అంటారో నాకు తెలియదు. ఎక్స్‌టెన్షన్ అయితే ఉంటుంది. 
 
'మంగళవారం' అంటే సమాజంలో ఓ అభిప్రాయం ఉంది. ఆ టైటిల్ పెట్టడం వెనుక...
మంగళవారం శుభప్రదమైన రోజు. జయవారం అంటారు. ముందు మనకు ఆ రోజు సెలవు ఉండేది. బ్రిటీషర్ల వచ్చి ఆదివారం సెలవు చేశారు. ఈ టైటిల్ పోస్టర్ విడుదల చేయగానే పెద్ద వంశీ గారు ఫోన్ చేశారు. ''మంచి టైటిల్ అజయ్! నేను చాలాసార్లు ఆ టైటిల్ పెడదాం అంటే నిర్మాతలు ఒప్పుకోలేదు'' అన్నారు. ఆయన నుంచి ఫోన్ రావడం చాలా సంతోషంగా ఉంది.  
 
'మహాసముద్రం' హిట్టయినా ఈ సినిమా తీసేవాడిని అన్నారు!
అవును. ఆ సినిమా చేసేటప్పుడు అదితిరావు హైదరికి కూడా కథ చెప్పా. ఆమెను చేయమని అడగలేదు. ఫిమేల్ ఓరియెంటెడ్ కథ కాబట్టి ఆమె ఎలా ఫీలవుతుందో అని చెప్పా. వెంటనే చేస్తానని అంది. తర్వాత నేను కాంటాక్ట్ చేయలేదు.   
 
ఈ సినిమాతో మీరు నిర్మాతగా మారారు!
నాకు ప్రొడ్యూస్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. 'మహాసముద్రం' తర్వాత ఈ 'మంగళవారం' నేనే ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నా. మా బ్రదర్ సురేష్ వర్మ గారికి చెబితే 'అజయ్! మేం కూడా సినిమా చేద్దామని అనుకుంటున్నాం. కొలాబరేట్ అవుదాం' అని స్వాతి గారికి పరిచయం చేశారు. ఆవిడ చాలా మంచి వ్యక్తి. నేను ఎప్పుడూ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళకు డబుల్ రెస్పెక్ట్ ఇస్తా. స్వాతి గారు కథ విని చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆవిడ ముందుకు రావడం నాకు ఇంకా బూస్టప్ ఇచ్చింది. 
 
అల్లు అర్జున్ గారికి సినిమా ఎప్పుడు చూపిస్తున్నారు? మీ గురువు రామ్ గోపాల్ వర్మకి?
బన్నీ గారు చాలా బిజీగా ఉన్నారు. 'పుష్ప 2' కోసం భారీ ఎత్తున చిత్రీకరణ జరుగుతోంది. ఆయన ఎప్పుడు చూస్తానంటే అప్పుడు చూపించడానికి రెడీ. మా బాస్ ఎప్పుడూ విడుదలకు ముందు చూడరు. విడుదలైన తర్వాత థియేటర్లలో చూస్తారు. 
 
కార్తికేయతో మళ్ళీ సినిమా ఎప్పుడు? 'మంగళవారం'లో ఆయన కూడా ఉంటే 'ఆర్ఎక్స్ 100'కాంబో రిపీట్ అయ్యేది కదా!
పాయల్ ఒకసారి మళ్ళీ మనం సినిమా చేద్దామంటే చేయనని చెప్పా. వాళ్లిద్దరూ హీరో విలన్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. మళ్ళీ వాళ్లిద్దరూ చెట్టపట్టాలు వేసుకుని డ్యాన్స్ చేస్తే ఒప్పుకోరు. నేను కూడా ఒప్పుకోను. ఆ కాంబోలో నేను అయితే సినిమా చేయను. కార్తికేయతో మళ్ళీ సినిమా ఉంటుంది. కుదిరినప్పుడు చెబుతా. 
 
'మంగళవారం'తో మీ మీద అంచనాలు పెరిగాయి. మరి, నెక్స్ట్ సినిమా ఏంటి?
జానర్ మార్చేశా. ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నా. హీరో ఇంకా ఎవరు ఫిక్స్ కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మరో 15 ఏళ్లపాటు అల్లు అర్జున్‌కి రాజయోగం, వేణుస్వామిని ఆడుకుంటున్న నెటిజన్లు (video)

Sabarimala: శబరిమలలో భారీ వర్షాలు.. భక్తులు రావొద్దు.. నాలుగు రోజులు ఆగండి.. (video)

Beautiful wives available: ఈ దేశంలో అందమైన భార్యలు అద్దెకు దొరుకుతారు.. ఎక్కడో తెలుసా?

LK Advani: ఎల్‌కె అద్వానీ మరోసారి తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రిలో చేరిక

EVKS Elangovan: ఈవీకేఎస్ ఇళంగోవన్ మృతి.. పెరియార్ సోదరుడి మనవడు ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments