Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు విష్ణు షాకింగ్ డిసిషన్, ఆ ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేస్తే హిట్ వస్తుందనీ...

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2020 (16:53 IST)
విష్ణు సినిమాతో హీరోగా పరిచయమై.. తొలి సినిమాతో కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో సక్సస్ సాధించకపోయినా మంచి నటుడు అనిపించుకున్న హీరో మంచు విష్ణు. ఆ తర్వాత సూర్యం, అస్త్రం, గేమ్, ఢీ తదితర చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దేనికైనా రెడీ, దూసుకెళ్తా, పాండవులు పాండవులు తుమ్మెద, ఈడోరకం ఆడోరకం తదితర చిత్రాలతో సక్సస్ సాధించిన మంచు విష్ణు ఆ తర్వాత కెరీర్లో సరైన సక్సస్ లేక బాగా వెనకబడ్డాడు. 
 
లక్కున్నోడు, ఆచారి అమెరికా యాత్ర, ఓటర్ .. తదితర చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. దీంతో ఈసారి చేసే సినిమాతో సక్సస్ సాధించాలని సరైన కథ కోసం వెయిట్ చేస్తున్నాడు విష్ణు. గత కొంతకాలంగా ఫ్లాప్‌లతో సతమతమౌతున్న విష్ణు ఓ నిర్ణయం తీసుకున్నారట. అది ఏంటంటారా.. విష్ణు వలే వరుసగా ఫ్లాపులతో సతమౌతున్న శ్రీను వైట్ల డైరెక్షన్లో సినిమా చేయాలనుకుంటున్నాడట. 
 
ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఎవరైనా సక్సస్‌‌లో ఉన్న డైరెక్టర్‌తో సినిమా చేయాలనుకుంటారు కానీ.. విష్ణు అలా ఆలోచించకుండా ఫ్లాప్ డైరెక్టర్ తోనే సినిమా చేయాలనుకోవడం విశేషం. మంచు విష్ణు, శ్రీను వైట్ల.. ఈ ఇద్దరూ కలిసి ఢీ సినిమాకి సీక్వెల్ తీయాలనుకుంటున్నారని తెలిసింది. మంచు విష్ణు - జెనీలియా జంటగా రియల్ స్టార్ శ్రీహరి ప్రధాన పాత్రలో నటించిన ఢీ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. 
 
ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని శ్రీను వైట్ల కథను సిద్ధం చేసారని టాక్. ఇటీవల విష్ణుకు కథ చెప్పడం.. కథ విని ఓకే చెప్పడం జరిగిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే... ప్రచారంలో ఉన్న ఈ వార్త గురించి విష్ణు ట్విట్టర్లో స్పందిస్తూ... చాలామంది నాకు ఫోన్ చేసి ఢీ 2 శ్రీను వైట్ల గారి డైరెక్షన్లో స్టార్ట్ అవుతుందని కంగ్రాట్స్ చెప్పారు. 
 
నాకు అన్నలాంటి శ్రీను వైట్ల గారిని అడిగితే బెటర్. ప్రాజెక్ట్ డీటైల్స్ వరకు... నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటూ సరదాగా ట్వీట్ చేసారు. మంచు విష్ణు ఈవిధంగా ట్వీట్ చేయడంతో ఢీ 2 త్వరలోనే సెట్స్ పైకి వెళుతుంది అని టాక్ వినిపిస్తోంది. మరి.. మంచు విష్ణు - శ్రీను వైట్ల ఢీ 2 ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సస్ సాధిస్తారని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments