Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు విష్ణు హీరోగా కొత్త చిత్రం ప్రారంభం.. హీరోయిన్‌గా సోనారికా...

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2015 (18:42 IST)
మంచు విష్ణు హీరోగా అడ్డా ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో నూతన చిత్రం గురువారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. సోమా విజయ్ ప్రకాష్ నిర్మాణ నిర్వహణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. జాదూగాడు ఫేమ్ సోనారిక హీరోయిన్‌గా నటిస్తుంది. ముహుర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ కొట్టగా, జెమిని కిరణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా మంచు విష్ణులాంటి హీరో, డి.కుమార్, పల్లి కేశవ్ రావ్ వంటి మంచి నిర్మాతలు ఈ చిత్రంలో ఉండటం చాలా హ్యపీగా ఉంది. లవ్ లోకొత్త యాంగిల్ చూపే లవ్ విత్ యాక్షన్ ఎంటర్ టైనర్.
 
 
సినిమాని నాలుగు షెడ్యూల్స్‌లో హైదరాబాద్, వైజాగ్‌లలో చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నాం. మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరి. విష్ణు బాడీ లాంగ్వేజ్‌కి తగిన విధంగా ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. అనూప్ మ్యూజిక్ అందిస్తున్నారు. శుక్రవారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తామని చిత్ర దర్శకుడు జి.కార్తిక్ రెడ్డి అన్నారు. 
 
మా బ్యానర్‌లో చేస్తున్న రెండో మూవీ. సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని రూపొందిస్తాం. మంచి ఎంటర్ టైనింగ్ సబ్జెక్ట్. విష్ణు బాడీ లాంగ్వేజ్‌కి తగిన స్టోరి. సోనారిక బబ్లీ గర్ల్‌గా నటిస్తుంది అని నిర్మాతలు డి.కుమార్, పల్లి కేశవ్ రావ్, సోమా విజయ్ ప్రకాష్ అన్నారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. విష్ణుతో నటించడానికి ఎదురుచూస్తున్నానని హీరోయిన్ సోనారిక అన్నారు. 
 
ఈ చిత్రంలో బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, రవికిషన్‌, పృథ్వీ, రాజా రవీంద్ర, వెన్నెలకిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి, సత్య, నవభారత్‌ బాలాజీ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కెమెరా: విజయ్‌ సి.కుమార్‌, ఎడిటర్‌: యస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: రామాంజనేయులు, ఫైట్స్‌: విజయ్‌, పి.ఆర్‌.ఓ: వంశీ-శేఖర్‌, నిర్మాణ, నిర్వహణ: సోమా విజయ్‌ప్రకాష్‌, నిర్మాతలు: డి.కుమార్‌, పల్లి కేశవరావు, రచన-దర్శకత్వం: జి.కార్తిక్‌ రెడ్డి. 

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments