Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావ‌ళి సంద‌ర్భంగా 'గుంటూరోడు'గా రానున్న మంచు మనోజ్

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ఎస్కే. సత్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గుంటూరోడు'. ఈ సినిమా మొత్తం గుంటూరు నేప‌థ్యంలోనే జ‌రుగుతుంది కాబ‌ట్టే సి

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (15:52 IST)
క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ఎస్కే. సత్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గుంటూరోడు'. ఈ సినిమా మొత్తం గుంటూరు నేప‌థ్యంలోనే జ‌రుగుతుంది కాబ‌ట్టే సినిమాకు ఆ టైటిల్‌ను పెట్ట‌డం జ‌రిగింది. దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసింది. 
 
ఈ సంద‌ర్భంగా డైర‌క్ట‌ర్ మాట్లాడుతూ, ఇది పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అని, అందరిని అలరించే విధంగా సినిమా ఉంటుందని తెలియజేసారు. ప్రొడ్యూస‌ర్ మాట్లాడుతూ, ఇప్ప‌టికే సినిమా టాకీ పార్టు పూర్తి అయింది. మిగ‌తా కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం అన్నారు. 
 
మంచు మనోజ్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో మ‌నోజ్ సరసన కథానాయకిగా ప్రగ్యా జైస్వాల్ (కంచే ఫేమ్) నటించనుండగా ముఖ్య పాత్రలలో రాజేంద్ర ప్రసాద్, సంపత్, కోట శ్రీనివాసరావు, ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సంగీతం: డీజే శ్రీ వసంత్, సినిమాటోగ్రఫి: సిద్దార్ధరామస్వామి, ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్, ఫైట్స్: వెంకట్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: బుజ్జి, సురేష్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రభు తేజ, నిర్మాత: శ్రీ వరుణ్ అట్లూరి, కథ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్శకత్వం : ఎస్కే.సత్య. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments