Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక నుంచి అన్ని మంచి రోజులే : మనమే ప్రీరిలీజ్లో శర్వానంద్

డీవీ
గురువారం, 6 జూన్ 2024 (20:04 IST)
sharva nandh T G Vishwaprasad, Kritishetti and others
ఛార్మింగ్ స్టార్ శర్వా తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ 'మనమే' తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి రెడీగా వున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. 'మనమే' జూన్ 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ శర్వాకు 'ఛార్మింగ్ స్టార్‌' టైటిల్ ఇచ్చారు. ఈ మేరకు రూపొందించిన స్పెషల్ వీడియోను ఈవెంట్ లో ప్రజెంట్ చేశారు. గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకలో స్టార్ డైరెక్టర్స్ మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేష్, కిషోర్ తిరుమల అతిధులుగా పాల్గొన్నారు.
 
ప్రీరిలీజ్ రిలీజ్ ఈవెంట్ లో ఛార్మింగ్ స్టార్ శర్వా మాట్లాడుతూ..   నాలుగో సారి సీఎం అయిన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, హ్యాట్రిక్ కొట్టిన మా బాలకృష్ణ గారికి, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హార్టీ కంగ్రాజులేషన్స్. చాలా సంతోషంగా వుంది.  రిజల్ట్స్ వచ్చేశాయి. ఒక పండగ వాతావరణం స్టార్ట్ అయ్యింది. జూన్ 7న మనమే అంటూ మరో పండగ స్టార్ట్ అవుతోంది. దాని తర్వాత 27 కల్కి. మరో పండగ వాతావరణం. ఇక నుంచి అన్ని మంచి రోజులే. శ్రీరామ్ మనమే కథ ఎప్పుడో చెప్పారు. యాక్చువల్లీ నేను వేరే కథ చేయాలి. అయితే వరుసగా సీరియస్ సినిమాలు చేసేస్తున్నానని నాకే అనిపించింది. అందరూ కనబడినపుడు మహానుభావుడు, ఎక్స్ ప్రెస్ రాజా, రన్ రాజా రన్ లాంటి ఎంటర్ టైనర్స్ చేయమని కోరేవారు. నాకూ ఎప్పుడూ కొత్తగా చేయాలనే వుంటుంది. కథల్లో క్యారెక్టరైజేషనే కొత్తగా వుంటుంది. మనమే లో అలాంటి కొత్త క్యారెక్టరైజేషనే వుంది. మంచి కథ చేయాలి, ఎంటర్ టైన్నింగ్ గా వుండాలని అనుకున్నాం. అన్నీ సినిమాలు కాదని ఈ సినిమాని ఎంచుకోవడానికి కారణం ఒక బ్యూటీఫుల్ పాయింట్ టైం గురించి. మనిషి మనిషికి ఇవ్వగలిగే గొప్ప గిఫ్ట్ టైం. ఈ సినిమాలో శ్రీరామ్ ఆదిత్య ఈ పాయింట్ ని చాలా చక్కగా చెప్పారో చూస్తారు. లాస్ట్ 40 మినిట్స్  మిమ్మల్ని ఇంకో ప్రపంచంలోకి తీసుకెల్తారు. ఓన్లీ ఎంటర్ టైన్మెంట్ కి ఓ మంచి సినిమా తీయాలని చేశాం. ఎట్టిపరిస్థితిలో డిస్సాపాయింట్ చేయనివ్వం. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు.
 
ప్రతిఒక్కరం చాలా కష్టపడి ప్రతి రోజు గొడవపడుతూ సినిమా చేశాం. సినిమాని నమ్మాము. ప్రేమించాం. ప్రేమ వున్నప్పుడు ఎప్పుడూ గొడవలు వుంటాయి. ఈ సినిమాని అంతగా ప్రేమించాను. నేను ఇంత కొత్తగా కనిపించినా, పెర్ఫెర్ఫాం చేసిన ఆ క్రెడిట్ అంతా శ్రీరామ్ కే ఇస్తా. తనని మొదటి నుంచి బలంగా నమ్మాను. తను చాలా పెద్ద డైరెక్టర్ అవుతారని ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి చెబుతూనే వున్నాను. శ్రీరామ్.. ఐ హేట్ యూ . ఐ లవ్ యూ టూ. వాళ్ళ వైఫ్  మీ రెండో పెళ్ళామని ఎప్పుడూ అంటూ వుంటారు.(నవ్వుతూ) వాళ్ళిద్దరూ ఎంత గొడవపడ్డారో తెలీదు కానీ మేము ఈ సినిమాకి అంత గొడవ పడ్డాం. దిని గురించి సక్సెస్ పార్టీలో మాట్లాడుకుందాం.సక్సెస్ అంటే గుర్తుకువచ్చింది. ఈ ఫంక్షన్ పిఠాపురంలో చేయాలని అనుకున్నాం. కానీ పర్మిషన్ దొరకలేదు. విశ్వ గారు ప్లాన్ చేస్తే సక్సెస్ పార్టీ ఫస్ట్ అక్కడ చేస్తాం. సినిమా సక్సెస్ పార్టీ పిఠాపురంలో జరగాలని నా కోరిక. సక్సెస్ కొట్టిన తర్వాత పిఠాపురంలో కలుస్తాం.
 
మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటర్స్ కి థాంక్స్. కృతి గారు ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వచ్చారు. చాలా చక్కగా చేశారు. ఐ థింక్ యువర్ డాడ్ ఈజ్ వెరీ ప్రౌడ్. ఆయన మొహంలో ఆనందం కనిపిస్తోంది.  ఇలాంటి మంచి సినిమాలు బాగా తీయాలని కోరుకుంటున్నాను. మారుతి గారు, కిషోర్ గారు, శివ నిర్వాణ గారు, సాయి రాజేష్ గారు థాంక్స్ ఫర్ కమింగ్. 35 సినిమాలు, 20 ఏళ్ళు ఎలా అయ్యిందో తెలీదు. నాన్న గారు దీని గురించి మాట్లాడుతుంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఐయాం వెరీ ప్రౌడ్  అఫ్ మై ఫిల్మోగ్రఫీ. ఈ సందర్భంగా హిట్లుకి ఫ్లాపులకి సంబంధం లేకుండా నాతో సినిమాలు  తీసుకున్న డైరక్టర్స్, ప్రొడ్యూసర్స్ కి, జన్మనిచ్చిన తల్లితండ్రులకు, ఫ్రండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి ముఖ్యంగా ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి పాధాబివందన. ఛాన్స్ కోసం ఫోటోలు పట్టుకొని ఆఫీస్ లు చుట్టూ తిరిగిన రోజులు గుర్తున్నాయి. ఈ రోజు ఆ కళామతల్లి, ఇండస్ట్రీ ఇంత ఇచ్చిందంటే రియల్లీ గ్రేట్ ఫుల్. స్వామీ శరణం. చాలా ఎమోషన్ గా వుంది. ఇట్స్ గుడ్ ఫీలింగ్. ఇరవైఏళ్ళు పట్టింది ఒక స్టార్ స్టేటస్ రావడానికి. 'ఛార్మింగ్ స్టార్' అనే టైటిల్ ఇచ్చిందుకు విశ్వగారికి చాలా థాంక్స్. నాతో పాటు జర్నీ చేసిన నా టీం అందరికీ థాంక్స్. వంశీ శేఖర్ పీఆర్వో కంటే మా డార్లింగ్స్. మేమంతా ఒకేసారి స్టార్ట్ అయ్యాం. వాళ్ళ ఫస్ట్ సినిమా, నా సినిమా 'కో అంటే కోటీ' తో మొదలై వారు పీఆర్వోలు అయ్యారు. ఈ రోజు వన్ అఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీలా అయ్యారు. ఐయాం సో ప్రౌడ్ అఫ్ యూ డార్లింగ్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ నేత ఆమ్‌స్ట్రాంగ్ దారుణ హత్య.. కత్తులతో వెంటబడి..?

మనిషిని కాటేసిన పాము.. పామును కరిచిన వ్యక్తి.. ఏమైంది?

ప్రజల ఆగ్రహం తనను తాకిందంటూ భావేద్వేగానికి లోనైన రిషి సునాక్!

మాజీ సీఎం జగన్‌కు మతిభ్రమించింది.. ఆట ఇపుడే మొదలైంది... : బొలిశెట్టి సత్యనారాయణ

డ్రైవర్ లేదు.. కానీ బస్సు తానంతట అదే నడిచింది.. వ్యక్తి మృతి.. ఎలా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments